A unique gift of Dharmavaram Netanna to Ayodhya Rama To reflect the events of Ramayana

Everyone in the country is making efforts in their own style to give a wonderful atmosphere to the Rama temple that is taking shape in Ayodhya. Handloom artisans from Dharmavara, Sathya Sai district of Andhra Pradesh, which is famous for its silk fabrics, made a magnificent silk cloth for Sri Ramudi. Five handloom artists labored for about four months to make an unprecedented garment. Made with natural colors on the loom, this cloth is a must-see for anyone. About 160 feet i.e. about 49 meters, this garment is six sarees long.

The edges of this cloth are exquisitely decorated. Handloom artisans have woven scenes from the Ramayana on both sides of the border. Starting from the cursing of Dasharatha Maharaja by Sravana's son from Lanka to the coronation of Sitaramula reaching Ayodhya, 400 key moments in the Ramayana have been incredibly woven on this cloth.

 You have to see these incredible scenes that look like blindfolded. Not only that, in the middle part of this cloth Ramakoti is woven saying Jai Shri Ram in 13 languages. Jaishreeram letters woven in Telugu, Hindi, English, Urdu, Gujarati, Odia as well as Sinhala are mesmerizing. They have spent nearly two lakh rupees for this. These handloom artists are trying to present it to Ram of Ayodhya.

Telugu version

అయోధ్యలో రూపుదిద్దుకుంటున్న రామ మందిరానికి అద్భుత హంగులు చేకూర్చేందుకు దేశంలో ప్రతీ ఒక్కరూ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టువస్త్రాలకు ఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్‌ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కళాకారులు శ్రీరాముడి కోసం అపురూప పట్టు వస్త్రాన్ని తయారు చేశారు.

 ఐదుగురు చేనేత కళకారులు దాదాపు నాలుగు నెలలపాటు శ్రమించి ఒక అపూర్వ వస్త్రాన్ని తయారు చేశారు. మగ్గంపై సహజ రంగులతో తయారు చేసిన ఈ వస్త్రాన్ని ఎవరైనా సరే చూస్తూ ఉండిపోవాల్సిందే. దాదాపు 160 అడుగులు అంటే సుమారు 49 మీటర్ల ఈ వస్త్రం ఆరు చీరల పొడవు ఉంటుంది.

ఈ వస్త్రం అంచులను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అంచుకు రెండు వైపులా రామాయణంలోని అపూర్వ ఘట్టాలను నేశారు చేనేత కళాకారులు. దశరథ మహారాజును శ్రవణ కుమారుడు శపించడం మొదలు లంక నుంచి సీతారాములు అయోధ్యకు చేరిన పట్టాభిషేకం వరకు రామాయణంలో 400 కీలక ఘట్టాలను ఈ వస్త్రంపై ఎంతో అపురూపంగా నేశారు. కళ్లకు కట్టినట్టుగా కనిపించే ఈ అపురూప దృశ్యాలను అలా కళ్లప్పగించి చూడాల్సిందే.

 అంతే కాదు ఈ వస్త్రం మధ్య భాగంలో 13 భాషల్లో జై శ్రీరామ్‌ అని రామకోటిని నేసారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, ఉర్దూ, గుజరాతీ, ఒడియాతో పాటు సింహళ భాషలో నేసిన జైశ్రీరామ్‌ అక్షరాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దీని కోసం వీరు దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీనిని అయోధ్య రాముడికి బహుకరించేందుకు ఈ చేనేత కళాకారాలు ప్రయత్నాలు చేస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens