alth

Not only apricots but also the seeds are the miracle medicine if used like this to check those problems

Apricots are among the most popular fruits available in the monsoon fruit market. Everyone likes to eat this shiny black fruit. It also has many health benefits. But the mistake made by the majority of people is that they eat apricots and discard the seeds. Experts say that is a big mistake. There is no reason for that. The powder made from nereed seeds works like a panacea in maintaining health and removing health problems. And now let's see how many benefits are there with this apricot seed.

Diabetes: Consuming nereed seed powder keeps the blood sugar levels under control. It is also very beneficial for diabetic patients. For this you just need to drink a teaspoon of amaranth seed powder in a glass of water a day.

Digestive system: The powder extracted from nereda seeds relieves stomach related problems. Prevents constipation, dyspepsia, acidity problems.. Improves the functioning of the digestive system.

Mental health: Apricot seed powder shows good results on your mental health. Relieves fatigue and stress and brings peace.

Check for weight problem: It is also a panacea for those who want to lose weight. The fiber in amaranth seed powder helps you lose weight. It also prevents hunger cravings for a long time.

Method of preparation of Neredu seeds powder: For Neredu seeds powder, first cover the seeds with any cloth and dry them in the sun. When they are completely dry, cut them into pieces and grind them in a grinder or mixer.

Telugu version

వర్షాకాలపు పండ్ల మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో నేరేడు ఎంతో ప్రముఖమైనవి. చూడడానికి నల్లగా నిగనిగలాడుతున్న ఈ పండ్లను తినేందుకు అందరూ ఇష్టపడతారు. దీనితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. అయితే మెజారిటీ శాతం మంది చేసే తప్పు ఏమిటంటే.. నేరేడు పండుని తినేసి అందులోని విత్తనాలను పారేస్తారు. అదే పెద్ద తప్పు అంటున్నారు నిపుణులు. అందుకు కారణం కూడా లేకపోలేదు. నేరేడు విత్తనాల నుంచి తయారు చేసిన పొడి ఆరోగ్యాన్ని కాపాడడంలో, ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. మరి ఈ నేరేడు గింజతో ఎన్నెన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మధుమేహం: నేరేడు విత్తనంలోని పొడిని తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అందుపులో ఉంటాయి. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్‌కి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం మీరు రోజుకు ఒక గ్లాస్ నీటిలో టీస్పూన్ నేరేడు గింజల పొడి కలిపి తాగితే చాలు.

జీర్ణవ్యవస్థ: నేరేడు విత్తనాల నుంచి తీసిన పొడి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం, అజీర్తి, అసిడిటీ సమస్యలను నివారించి.. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

మానసిక ఆరోగ్యం: నేరేడు గింజల పొడి మీ మానసిక ఆరోగ్యంపై మంచి ఫలితాలను చూపిస్తుంది. అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి ప్రశాంతతను కలిగిస్తుంది.

బరువు సమస్యకు చెక్: బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది దివ్యౌషధం. నేరేడు గింజల పొడిలోని ఫైబర్ మీ బరువు తగ్గేలా చేస్తుంది. ఇంకా ఎక్కువ సమయం ఆకలి కోరిక కలగకుండా చేస్తుంది.

నేరేడు గింజల పొడి తయారీ విధానం: నేరేడు గింజల పొండి కోసం ముందుగా విత్తనాలకు ఏదైనా క్లాత్‌ కప్పి ఎండలో ఆరబెట్టాలి. అవి పూర్తిగా ఆరిపోయినప్పుడు, వాటిని ముక్కలుగా కట్ చేసి గ్రైండర్‌లో, లేదా మిక్సీలో పొడిగా చేసుకోవాలి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens