s Mana Nestham 2025 Dairy Edition

సాధారణ రైతు కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా - నల్లా సూర్యప్రకాష్ రావు గారి ప్రేరణాత్మ క కథ | Mana Nestham 2025 Dairy Edition

జననం , కుటుం బ నేపథ్యం
శ్రీ నల్లా సూర్యప్రకాష్ రావు గారు 1960లలో ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ ప్రాంతంలోని రెడ్డిపల్లి గ్రామం లో
శ్రీ నల్లా దానేశ్వరరావు, శ్రీమతి పుణ్యవతి దంపతులకు జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో
జన్మిం చినప్ప టికీ, విద్యతో పాటు కృ షి, పట్టుదలతో ఉన్న సూర్య ప్రకాశ్ రావు గారు జీవితం లో అసాధారణ
విజయాలను సాధించారు.
విద్యా భ్యా సం
ప్రాథమిక విద్యను మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత విద్యను కామనగరువు జిల్లా
ప్రజా పరిషత్ పాఠశాలలో పూర్తి చేశారు. కళాశాల విద్య ను ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో కొనసాగించారు.
ఉన్నత విద్యా ప్రయాణం కర్ణాటక రాష్ట్రం లో M.Sc. (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేయడంతో ముగిసింది.
ఉద్యోగ జీవితం నుండి వ్యాపారంలో అడుగులు
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, వ్యాపార రంగం లో అడుగుపెట్టే దిశగా
ప్రయత్నించారు. 1998లో మరొక స్నేహితుడితో కలిసి "మెట్రోకెమ్" పరిశ్రమను స్థాపించారు.
2006లో "సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రెడియెంట్స్ " పరిశ్రమను, 2017లో "జాహ్నవి లైఫ్ సైన్సెస్"ను
స్థాపించారు మరియు 2023 లో “సినాక్ ఫార్మా స్యూ టికల్స్ ” స్థాపించారు. ఈ సంస్థలు భారతదేశం
సహాప్రపం చవ్యాప్తం గా పేరుగాంచాయి.
వ్యాపార విశిష్టతలు
ఆయన స్థాపించిన పరిశ్రమలు USFDA, WHO, EDQM, PMDA, ANVISA వంటి
అనుమతులు పొందాయి. ఈ పరిశ్రమల ద్వారా దేశ విదేశాల్లోని ప్రముఖ ఔషధ సంస్థలకు ఉత్పత్తులను
సరఫరా చేయడం జరిగిం ది. హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో పరిశ్రమలు స్థాపించి, అనేకమందికి
ఉపాధి కల్పించారు.
సామాజిక సేవలు
సూర్య ప్రకాశ్ రావు గారు పాఠశాల అభివృద్ధికి దోహదంచేస్తూ , దాతృత్వ కార్యక్రమాల్లో చురుకుగా
పాల్గొన్నారు. రెడ్డిపల్లిలోని పాఠశాల కోసం ఆడిటోరియం నిర్మించడంతో పాటు, కరోనా మహమ్మారి
సమయం లో మాస్కు లు, సానిటైజర్లు పంపిణీ చేశారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు.
ఆధ్యా త్మిక మరియు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు
"శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి మహా పీఠం " ఆధ్వర్యం లో వేద పాఠశాలను స్థాపించారు. కన్నూరు గ్రామాన్ని
దత్తత తీసుకుని, సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేశారు.
అవార్డులు మరియు గుర్తిం పులు
తన కృషి ద్వారా డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ
అవార్డును అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ రామేశ్వర టాగూర్ గారి చేతులమీదుగా స్వీకరించడం
గర్వకారణం .
పట్టుదల – విజయాల పునాది
స్వంత శ్రమ, పట్టుదలతో వ్యాపార రంగం లో ఉన్నతస్థాయికి ఎదిగిన సూర్య ప్రకాశ్ రావు
గారు, తన స్ఫూర్తితో సమాజానికి సేవ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens