శ్రీ. రవణం స్వామి నాయుడు గారు 1963 జూన్ 15న తూర్పు గోదావరి జిల్లా అమలాపురం లో జన్మించారు. వీరి తండ్రి లేటు ముత్యాలరావు గారు, తల్లి సత్యవతి రవణం గారు. మెకానికల్ ఇంజనీరిం గ్ (డిప్లొమా) లో విద్యను పూర్తిచేసిన స్వామి నాయుడు గారు విద్యలో ప్రతిభ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వీరి సతీమణి
రవణం వరలక్ష్మి గారు. కుటుంబ విలువలను కాపాడుకుంటూ సమాజంలో గౌరవంగా నిలిచారు.
సేవా మార్గం
రవణం స్వామి నాయుడు గారు సమాజసేవను జీవన విధానంగా తీసుకున్న వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవి గారి ఆదర్శాలతో ప్రేరణ పొందిన ఆయన, అఖిలభారత చిరంజీవి యువత అనే సేవాసం స్థను స్థాపించి, అధ్యక్షుడిగా సేవలం దిస్తున్నారు. అదేవిధంగా, చిరంజీవి ఐ & బ్లడ్ సెంటర్ లో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నా రు.
వెలుగునిచ్చిన సేవలు
రవణం స్వామి నాయుడు గారు రక్తదానానికి, నేత్రదానానికి ఎంతో ప్రాముఖ్య తను ఇచ్చారు. ఆయన ఆధ్వర్యం లో నడిచిన రక్తదాన శిబిరాలు, నేత్రదాన శిబిరాలు, వైద్య శిబిరాలు వం టి కార్య క్రామాలు ఎంతోమం ది జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి.
పురస్కారాలు మరియు ప్రశంసలు
రవణం స్వా మి నాయుడు గారి సేవలను గుర్తిస్తూ, భారత రాష్ట్రపతితో ప్రశంసా పత్రం అందుకున్నారు. అత్యధిక రక్తదాన కార్యక్రమాల నిర్వహణకు ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
స్ఫూర్తి మరియు లక్ష్యం
ఆయన సేవకు ప్రేరణ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చూపిన మార్గంలోనే సామాజిక సేవలు నిర్వహించి, జీవితాన్ని సేవాయజ్ఞంగా మార్చుకున్నారు.
సేవా కార్యక్రమాలు
- రక్తదాన శిబిరాలు
- నేత్రదాన శిబిరాలు
- వైద్య శిబిరాలు
- పచ్చదనం కోసం చెట్టు నాట్లు
పలువురు పెద్దలు వీరిని మెగాస్టార్ చిరంజీవి గారికి హనుమంతుడు లాంటివారు అని సంబోధిస్తుంటారు. ఇది నిజం అనటంలో సందేహం లేదు, జగమెరిగిన సత్యం .
సమాజానికి అంకితమై సేవలందిస్తూ, వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన రవణం స్వామి నాయుడు గారు, మనం దరికీ ఆదర్శప్రాయులు. ఆయన జీవన శైలి, సేవా ప్రేరణ అందరికీ స్ఫూర్తిదాయకం .