చిరంజీవి-నాని కొత్త సినిమా అప్డేట్
నటుడు నాని, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించబోయే భారీ సినిమాను నిర్మించనున్నారు. 'దసరా' సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఇటీవల నాని ఈ ప్రాజెక్ట్ పై కీలక సమాచారం ఇచ్చారు.
ప్రస్తుతం నాని ‘ప్యారడైజ్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి సినిమా షూటింగ్ మొదలవుతుంది అని చెప్పారు. ఈ మెగా సినిమా 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నాని తెలిపారు.
సినిమా టైటిల్, నటీనటులు, సాంకేతిక నిపుణులు వంటి వివరాలు అధికారికంగా ప్రాజెక్ట్ ప్రారంభమైన తర్వాత వెల్లడిస్తారు అని నాని చెప్పారు. చిరంజీవిని శ్రీకాంత్ ఓదెల ఎలా చూపించబోతున్నారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.