ఓదెల 2: తమన్నా అఘోరి పాత్రలో అదరగొడుతుంది!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "ఓదెల 2" ఈ రోజు థియేటర్లలోకి విడుదలవుతోంది. ఈ సినిమా 2022లో వచ్చిన "ఓదెల రైల్వే స్టేషన్" చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. మొదటి పార్ట్‌లో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పుడు రెండవ భాగంలో తమన్నా అఘోరి పాత్రలో కనిపించనుండగా, హెబ్బా పటేల్ మరియు వశిష్టలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మహా కుంభమేళాలో "ఓదెల 2" టీజర్‌ను విడుదల చేయడం సినిమా పైన మరింత హైప్ తీసుకువచ్చింది.
ఇతర సినిమాలా "ఓదెల 2"కి అమెరికాలో ప్రీమియర్ షోలు వేశారు. సినిమా గురువారం విడుదల కావడంతో, బుధవారం రాత్రే US ప్రీమియర్స్ చేశారు. వీటిని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫస్ట్ టాక్ సినిమాపై ప్రభావం చూపుతోంది.