సివిల్ సర్వీస్ డే సందర్భంగా అవార్డు ప్రదానం
ప్రధాన మంత్రి అవార్డు (2023-24) ను ఏలూరు జిల్లా కలెక్టర్ గా చేసిన విశేష సేవలకు వీ. ప్రసన్న వెంకటేశ్ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అందుకున్నారు. ఈ అవార్డు సివిల్ సర్వీస్ డే సందర్భంగా విజ్ఞాన్ భవన్, ఢిల్లీ లో జరిగిన వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రదానం చేయడం జరిగింది.
ప్రధాన మంత్రి అవార్డు భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డుల్లో ఒకటి, ఈ అవార్డు పొందిన దేశంలోని 10 మంది ఐఏఎస్ అధికారులలో ప్రసన్న వెంకటేశ్ ఒకరు. ఆయన 2022 జనవరి నుంచి 2024 జూలై వరకు ఏలూరు జిల్లా కలెక్టర్ గా పని చేసిన సమయంలో, ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడం, మహిళలు మరియు బాలికలలో రక్తహీనత నివారణకు కృషి చేయడం, అలాగే జనాభా ఆరోగ్య సంరక్షణలో అనేక కార్యక్రమాలు చేపట్టారు.
‘అక్షజ’ అనే కార్యక్రమం ద్వారా గర్భిణులు, ప్రసూతి మహిళల ఆరోగ్య సంరక్షణను అందించడం, ఏజెన్సీ మండలాల్లో ప్రజల కోసం మరింత మెరుగైన సేవలు అందించడం ఇందుకు ఉదాహరణ. ఈ విధంగా, సుపరిపాలన ద్వారా ప్రసన్న వెంకటేశ్ దేశంలోని 10 జిల్లాల కలెక్టర్లలో ఒకరిగా గుర్తించబడ్డారు. ఈ అవార్డు అందించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలపగా, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.