Tragedy in the town of samosas.. Collapsed due to heart attack while selling samosas..

An old man named Siva died on the road after a massive heart attack in Chirala town around 12 noon on Thursday . Siva, who has been making a living by selling samosas for decades, collapsed on his way to a shopping mall on Railway Station Road. The locals noticed and immediately informed the 108 personnel who rushed to the spot.

108 Emergency Medical Technician Kishor performed CPR but Siva's life was not saved. The 108 staff confirmed that he died of acute heart attack. Police took further action.

Meanwhile, heart attack deaths have increased in Telugu states. They are collapsing suddenly. In a matter of moments, they are becoming disembodied beings. Doctors say that by performing CPR immediately after a heart attack, they can be revived. That is why governments are also conducting awareness programs on CPR.

Telugu version

చీరాల పట్టణంలో శివ అనే వృద్ధుడు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటుతో నడిరోడ్డుపైనే హఠాన్మరణం చెందాడు. దశాబ్దాలుగా సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగించే శివ అదే పనిపై తిరుగుతూ రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ వద్దకు రాగానే కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు హుటాహుటిన తరలి వచ్చారు

108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కిషోర్ ఆధ్వర్యంలో సిబ్బంది సీపీఆర్ చేసినా శివ ప్రాణాలు నిలవలేదు.దీంతో అతడు తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందాడని 108 సిబ్బంది నిర్ధారించారు. పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.

కాగా ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు పెరిగాయి. ఉన్నట్లుండి  ఆకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో వ్యవధిలో విగత జీవులుగా మారిపోతున్నారు. గుండెపోటు వచ్చిన వ్యక్తులకు వెను వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా.. వారికి పునర్జన్మ ఇవ్వవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే సీపీఆర్‌పై అటు ప్రభుత్వాలు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens