Telangana Declares New Traffic Rules

Telangana traffic police is acting strictly in the case of motorists. New regulations are imposed day by day. Motorists are repeatedly told to follow the traffic rules. In this background, the traffic police are acting more strictly. The traffic police are cracking down on the motorists who are violating the rules by pasting other stickers on the number plates of the vehicles, wearing masks so that the number plates are not visible, picking up pending challans, putting black films on the car mirrors. Also, strict action will be taken against parents if vehicles are given to minors. Many people are roaming around in Hyderabad violating traffic rules. Traffic police of Hyderabad have put a spotlight on those who are roaming like this. A special drive is being conducted.

The traffic police will identify cars with black films on the mirrors, vehicles with incorrect number plates, and pending challans that have not been cleared. Besides, action will also be taken against those who have purchased a new vehicle and are driving it with a temporary number even after a month. The Hyderabad Traffic Police said that they will file chargesheets against those who commit traffic violations under Section 188 and Section 21 of the Hyderabad City Police Act 1348 F and present them in court.

And the number of road accidents is increasing in Hyderabad city. Traffic police are taking special measures to prevent accidents. The officials who are monitoring the road accidents are taking strict action against those who violate the rules. Innovative programs are being implemented to check those who commit serious violations in the squares and junctions of the city.

Telugu Version

వాహనదారుల విషయంలో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోజురోజుకు కొత్త నిబంధనలు విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని వాహనదారులకు పదేపదే చెబుతున్నా.. పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనాల నెంబర్ ప్లేట్లకు ఇతర స్టిక్కర్స్ అతికించడం, నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్ వేయడం, పెండింగ్ చలానాలను ఎగ్గొట్టడం, కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్లు వేయడం నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కొరఢా ఝులిపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అలాగే మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో ఎంతో మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ దర్జాతీ తిరుగుతున్నారు. ఇలా తిరుగుతున్న వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నజర్ పెట్టారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

అద్దాలకు బ్లాక్ ఫిల్మ్లు అతికించిన కార్లను, నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలు, పెండింగ్ చలానాలు క్లియర్ చేయకపోయినా.. అలాంటి వాహనాలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు ట్రాఫిక్ పోలీసులు. అంతేకాకుండా కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసి.. నెల కావొస్తున్నా ఇంకా తాత్కాలిక నెంబర్తోనే తిప్పుతున్న వారిపై కూడా చర్యలు చేపట్టనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసేవారిపైసీ సెక్షన్ 188, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఎఫ్ సెక్షన్ 21 ప్రకారం ఛార్జీషీట్లు దాఖలు చేసి.. వారిని కోర్టులో హాజరు పరుస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఇక హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలపై నిఘా పెడుతున్న అధికారులు.. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నగరంలోని చౌరస్తాలు, జంక్షన్లలో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే వారికి చెక్ పెట్టేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens