M.K. Stalin: తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్ తీర్మానం పై స్పందించిన స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కే. స్టాలిన్, తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ తీర్మానంపై స్పందించారు. చెన్నైలో లేవనెత్తిన ఆకాంక్ష ఇప్పుడు హైదరాబాద్‌లో నెరవేరిందని ఆయన అన్నారు. పారదర్శక డీలిమిటేషన్ ప్రక్రియ దేశంలో న్యాయం, సమానత్వం, మరియు సమాఖ్య స్ఫూర్తిని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టాలనుకుంటున్న డీలిమిటేషన్ చట్టం ప్రజాస్వామ్య సమతుల్యతను క్షీణపరచడంతో పాటు, అన్యాయాన్ని బలోపేతం చేస్తుందని స్టాలిన్ విమర్శించారు. చెన్నైలో అఖిలపక్ష సమావేశం మరియు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం కేవలం ప్రారంభమేనని ఆయన చెప్పాడు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, మిగతా రాష్ట్రాలుగా అనుసరించాలని ఆకాంక్షించారు.
స్టాలిన్, హైదరాబాద్‌లో జరిగే రెండో సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశాన్ని ప్రకటించారు. దేశ భవిష్యత్తును అన్యాయంగా మార్చడాన్ని వారు తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ తీర్మానం పాస్ చేయడం మైలురాయిగా భావిస్తున్నట్లు చెప్పారు.