సితార ఘట్టమనేని: అయ్య బాబోయ్.. మహేష్ బాబు కూతురు ఎంత అందంగా ఉందో!

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని:

సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు కారం సినిమాతో తాజాగా హిట్ కొట్టిన మహేష్, ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ SSMB29 షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది, ఇందులో మహేష్ జోడిగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు.

ఇప్పుడు మహేష్ బాబుకు సంబంధించి సితార ఘట్టమనేని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సితారకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. Star Kidsలో సితార ఒక ప్రముఖ పేరు. చిన్నప్పటి నుండి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌పై యాక్టివ్‌గా ఉండి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. కొద్ది రోజుల క్రితం, తాను నటనపై ఆసక్తి ఉన్నట్లు, సినిమాల్లోకి రాలనుకుంటున్నట్లు సితార చెప్పింది. ఇప్పటికే ప్రముఖ జ్యువెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్న సితార, ఉగాది పండగ సందర్భంగా పట్టు పరికిణిలో మరింత అందంగా ముస్తాబైంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఇక ఇప్పుడు మరోసారి సితార బ్యూటీఫుల్ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ఓ కార్యక్రమానికి వెళ్లిన సితార, రెడ్ డ్రెస్‌లో మరింత అందంగా కనిపించింది. ఈ సందర్భంలో తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సితార యొక్క లుక్స్, చిరునవ్వు నెటిజన్లను కట్టిపడేసాయి. దీనితో ఫ్యాన్స్ ఆమెకు "ప్రిన్సెస్", "అప్ కమింగ్ స్టార్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. సితారకి ఇప్పటికే తన సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది.

ఇప్పుడు సితార ఘట్టమనేని తన తల్లి నమ్రతతో కలిసి ఒక బ్రాండ్ ప్రమోషన్‌కు హాజరయ్యారని తెలుస్తోంది. సితార సర్కారు వారి పాట సినిమాను ప్రమోట్ చేసే సాంగ్‌లో కూడా కనిపించింది. ప్రస్తుతం సితార వయసు 13 సంవత్సరాలు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens