Rain forecast for AP On the other hand hailstorm This is the latest weather report

The cool news is the weather department. Scattered rains are likely to occur in many parts of the state for the next 3 days. On the other hand, the temperatures will increase by 2 to 4 degrees and citizens are advised to be alert. On Thursday, Shettur of Anantapur district recorded the highest temperature of 41 degrees. The State Disaster Management Organization has revealed that there is a chance of hailstorm in 60 mandals across AP on Friday. It said that there is a possibility of heavy rain in some places for the next five days.

The storm will cross the coast on the 14th
Cyclone 'Mocha' has become a severe storm in South East Bay of Bengal. Presently it is moving at a speed of 11 km per hour. 520 km west of Port Blair and 1020 km south-southwest of Sittwe, Myanmar by Thursday night. Centered in the distance. Cyclone 'Mocha' is likely to cross the coast of South East Bangladesh and North Myanmar at Cox's Bazar on May 14, officials of the Meteorological Department said. Winds are expected to blow at a speed of 175 kmph while crossing the coast.

A storm created havoc in Elur. Stormy winds blew in Bhimadolu and Dvarakathirumala. More than 120 electricity poles fell to the ground. Electricity was interrupted for 2 days in three villages. Trees were downed everywhere due to the storm. A woman named Adilakshmi died after a tree branch fell in P. Kannapuram. The roofs of houses were blown off in many places due to strong winds. Autos were washed away in the canal due to heavy winds.

Telugu version

కూల్ న్యూస్ చెప్పింది వెదర్ డిపార్ట్‌మెంట్. వచ్చే 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు టెంపరేచర్స్  2 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, పౌరులు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు. గురువారం అనంతపురం జిల్లా శెట్టూరులో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీ వ్యాప్తంగా శుక్రవారం 60 మండలాల్లో వడగాలులు వీచే చాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.  రానున్న ఐదు రోజులు కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులకు అవకాశం ఉందని పేర్కొంది.

14న తీరం దాటనున్న తుపాను
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను ‘మోచా’ తీవ్ర తుపానుగా మారింది. ప్రజంట్ ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో సాగుతోంది. గురు­వారం రాత్రికి పోర్టుబ్లెయిర్‌కు పశ్చిమంగా 520, మయన్మార్‌లోని సిట్వేకు దక్షిణ నైరుతి దిశగా 1020 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ‘మోచా’ తుపాను ఆగ్నేయ బంగ్లాదేశ్‌, ఉత్తర మయన్మార్‌ మధ్యలో కాక్స్‌ బజార్‌ వద్ద మే 14న తీరం దాటే అవకాశముందని ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందన్నారు.

ఏలూరులో గాలివాన బీభత్సం సృష్టించింది. భీమడోలు, ద్వారకాతిరుమలలో ఈదురుగాలులు వీచాయి.  120కు పైగా విద్యుత్‌ స్తంభాలు నేల కూలాయి. మూడు గ్రామాల్లో 2 రోజులపాటు విద్యుత్‌కు అంతరాయం కలిగింది. గాలివాన బీభత్సానికి ఎక్కడికక్కడ చెట్లు నేలకూలాయి. పి.కన్నాపురంలో చెట్టుకొమ్మ పడి ఆదిలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. ఈదురుగాలులకు పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ గాలులకు ఆటోలు కాలువలో కొట్టుకుపోయాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens