Pawan Kalyan Planned Another Programme Janasena Janavani On 3rd July

English Version

Janasena chief Pawan Kalyan has planned another program to depose the Jagan government. Janasena will launch a program called Janavani to make the voice of the common man heard. Janasena chief Pawan Kalyan will inaugurate the Janavani program on July 3 at the Makineni Basavapunnayya Auditorium in Vijayawada. Janasena leader Nadendla Manohar on Tuesday said that there would be a Janawani program to inform the government about the problems of the people. Pawan himself said he would receive applications from the public from 10 a.m. to 3 p.m. They will be sent to the concerned authorities. Nadendla Manohar said the Janasena office would look into the petitions. There will be a Janawani program every Sunday. It was clarified that the first two programs will be held in Vijayawada itself.

Manohar explained that in the past, governments would stand by the people and take action to solve public problems, and that chief ministers would listen to the grievances of the people and take up petitions. In the three years since the YCP came to power, the common man has lost the opportunity to file petitions. Pawan does not give up any chance to go public. Pawan, who is already providing financial assistance to tenant farmers who have committed suicide in the name of tenant farmer assurance drive, is embarking on this innovative program to freshly embrace public issues.

Telugu Version

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జగన్ ప్రభుత్వాన్ని నిలదీసేలా మరో కార్యక్రమానికి ప్లాన్‌ చేశారు. సామాన్యుడి గళం వినిపించేలా, జనసేన జనవాణి అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జూలై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో, జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలిపేలా జనవాణి కార్యక్రమం ఉంటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ స్వయంగా, ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. వాటిని సంబంధిత అధికారులకు పంపనున్నారు. జనసేన కార్యాలయం నుంచి అర్జీలపై ఆరాతీస్తామని వెల్లడించారు నాదెండ్ల మనోహర్. ప్రతీ ఆదివారం జనవాణి కార్యక్రమం ఉంటుందన్నారు. తొలి రెండు కార్యక్రమాలు విజయవాడలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. 

గతంలో ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టేవని, ముఖ్యమంత్రులు ప్రజల బాధలు విని అర్జీలు తీసుకొనేవారని వివరించారు మనోహర్. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో, అర్జీలు ఇచ్చే అవకాశం సామాన్యుడికి లేకుండా పోయిందన్నారు. అటు జనంలోకి వెళ్లేందుకు ఏ ఒక్క ఛాన్స్‌ని కూడా పవన్ వదులుకోవడం లేదు. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం చేస్తున్న పవన్, తాజాగా ప్రజాసమస్యలను స్వీకరించేందుకు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens