'I never run away from defeats.. I may lose today.. I will win tomorrow. The Janasena leader created attention among the Warangal NIT students with his interesting comments saying that even if he wanted to migrate to New Zealand. He shared some interesting situations in his life with the students. Janasena Party leader Pawan Kalyan participated in the 3-day Spring Spree celebrations at Warangal Knit College. On this occasion, he made interesting comments to the students. Art.. includes persons belonging to any State. Humanity and culture are the only things that unite people.
That's why the Natu Natu song moved beyond the regions. Pawan said that he usually does not go to the programs of educational institutes, but will share some incidents of my life with you. He reminded me that I took Leonardo da Vinci as my role model in my childhood.
Pawan Kalyan advised the students that they should never stop learning. If he fails today, he will succeed tomorrow. Pawan said that he did not run away from failures. But during the movie Khushi, Pawan made important comments that he wanted to migrate to New Zealand.. He also brought the immigration papers. Pawan said that after keeping those papers with him for a month, he decided to stay here no matter the difficulty or loss.
Pawan once again told about his inter studies. He said that his friends used to take notes during the inter exams. But he did not think that he should not copy even if he failed. Pawan Kalyan said that even if he failed in the inter exams, he was morally successful. Pawan praised that Nehru started NITs with a lot of foresight.
Telugu version
‘నేను ఎప్పుడూ పరాజయాల నుంచి పారిపోలేదు.. ఈరోజు నేను ఓడిపోవచ్చు.. రేపు గెలుస్తాను. ఒకానొక సందర్భంలో న్యూజిలాండ్ దేశానికి వలస వెళ్లిపోదామనుకున్నా .. కష్టమో నష్టమో ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నా’ అంటూ తన ఆసక్తికర కామెంట్స్ తో వరంగల్ నిట్ విద్యార్థుల్లో అటెన్షన్ క్రియేట్ చేశారు జనసేన అధినేత. తన జీవితంలో జరిగిన కొన్ని ఇంట్రస్టింగ్ సిచ్‌వేషన్స్ స్టూడెంట్స్ తో షేర్ చేసుకున్నారు. వరంగల్ నిట్ కాలేజ్ లో 3రోజుల పాటు జరగనున్న స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి చేసిన ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారాయన. కళ.. ఏ రాష్ట్రానికి చెందినవారినైనా కలుపుతుంది. మానవత్వం, సంస్కృతి ఒక్కటే మనుషులను ఏకం చేస్తుందన్నారు. అందుకే నాటు నాటు పాటకు ప్రాంతాలకు అతీతంగా పాదం కదిపారు. తాను సాధారణంగా విద్యా సంస్థల కార్యక్రమాలకు వెళ్లనని, అయితే నా జీవితంలో కొన్ని సంఘటనలను మీతో పంచుకుంటానన్నారు పవన్. తన బాల్యంలో లియోనార్డో డావిన్సీ నా రోల్ మోడల్‌గా తీసుకున్నానని గుర్తు చేశారు.
నేర్చుకోవడంఎప్పుడూ మానకూడదని.. ఫెయిల్యూర్స్ విజయానికి సోపానాలుగా మలచుకోవాలని స్టూడెంట్స్‌కు సూచించారు పవన్ కల్యాణ్. తాను ఇవాళ ఫెయిల్ అయితే .. రేపు విజయం సాధిస్తా. తానేప్పుడు ఫెయిల్యూర్స్ నుంచి మాత్రం పారిపోలేదని చెప్పారు పవన్. అయితే ఖుషీ సినిమా సమయంలో న్యూజిలాండ్ దేశానికి వలస వెళ్లిపోదామనుకున్నానని.. ఇమ్మిగ్రేషన్ పేపర్స్ కూడా తెప్పించుకున్నానంటూ కీలక కామెంట్స్ చేశారు పవన్. ఒక నెల పాటు ఆ పేపర్స్‌ని తనదగ్గర పెట్టుకొని.. కష్టమో నష్టమో ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు పవన్.
మరోసారి తన ఇంటర్ విద్యాభ్యాసం గురించి చెప్పారు పవన్. ఇంటర్ పరీక్షల టైంలో తన స్నేహితులు చిట్టీలు తీసుకెళ్లవారని.. తాను మాత్రం ఫెయిలైనా సరే కాపీ కొట్టకూడదని భావించనని చెప్పారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైనా.. నైతికంగా విజయం సాధించానని తెలిపారు పవన్ కల్యాణ్. అటు నెహ్రూ ఎంతో ముందుచూపుతో ఎన్ఐటీలను ప్రారంభించారని కీర్తించిన పవన్ .. మీ సామర్థ్యానికి తగిన ఉద్యోగాలు రావాలని ఆకాంక్షిస్తున్నానంటూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు జనసేనపార్టీ అధినేత.