Telugu Version
జనసేన(janasena ) చీఫ్ పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా వినే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడలో(Vijayawada) మొదటి సారి చేపట్టిన జనవాణి (Janavani) జనసేన భరోసా కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో రెండవ విడత జనవాణి కార్యక్రమం ఈరోజు చేపట్టారు. తన ఆఫీస్‌కు సమస్యలతో వచ్చిన ప్రజలను, ఫిర్యాదు దారులను అప్యాయంగా పలుకరించారు. వారి సమస్యలను ఓపికగా వింటున్నారు.
విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న ఉద్యోగులు పవన్ కల్యాణ్‌ను కలిసారు. తమ గోడు వినిపించారు. ఏళ్లుగా పని చేస్తున్నా తమని రెగ్యులరైజ్ చేయడం లేదని వాపోయారు. ఉద్యోగుల గోడును విన్న పవన్ కల్యాణ్ వారికి భరోసా ఇచ్చారు. 24 వేల మంది ఉద్యోగుల సర్వీస్‌లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు పవన్ కల్యాణ్. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల తరహాలో తెలంగాణలోని వారిని రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వీరిని పర్మినెంట్ చేయని పక్షంలో తాము అధికారంలోకి వస్తే చేస్తామని హామీ ఇచ్చారు. రెండు వారాలు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. ప్రజల నుంచి సమస్యలను తీసుకుని నేరుగా ప్రభుత్వానికి తెలియచేయడమే జనవాణి కార్యక్రమం ముఖ్యోద్దేశ్యమని జనసేన నేతలు చెప్పారు.
English Version
Janasena Chief Pawan Kalyan is trying to listen directly to public problems. Janavani (Janavani) Jana Sena Bharosa program which was conducted for the first time in Vijayawada, people gathered in large numbers. In this context, the second phase of Janavani program was taken up today. People who come to his office with problems and complainers are treated with contempt. Listening to their problems patiently.
The employees working in contracting and outsourcing in the power company met Pawan Kalyan. They made their voices heard. They complained that they are not being regularized even though they have been working for years. Pawan Kalyan reassured the employees after hearing their grievances. They demanded to regularize the services of 24 thousand employees. Pawan Kalyan said that he will put pressure on the government for electricity workers. He reminded that those in Telangana have been regularized on the lines of employees working in AP. If the YCP government does not make them permanent, they have promised to do so if they come to power. Party leaders said that Pawan Kalyan Janavani program will be organized in Rayalaseema and Uttarandhra for two weeks. Jana Sena leaders said that the main objective of Janavani program is to take problems from the people and inform them directly to the government.