Janasena Chief Pawan Kalyan full Speech Mandapeta East Godavari

The leader of the party, Pawan Kalyan, said that the Janasena Party has the power to save Andhra Pradesh, which is stuck in financial difficulties. He said that a strong opposition and a strong group of people are essential for democracy. Mandapet farmer of East Godavari district asked in Rythu Bharosa Sabha to give that strength as assurance. He said that he only knew how to give, but he did not know how to ask until now in his life. He said that even asking for votes would be difficult for him. On this occasion, people were asked to see that the Janasena government is formed. Pawan has once again made it clear that he will lead the Janasena party as long as he is alive. He said that the merger of his party will not happen under any circumstances. He asked me not to believe him blindly. He called for cooperation in the formation of the Janasena government in the next elections.

Why unenforceable guarantees?

On this occasion, Jana Senani once again poured fire on the YCP government. Pawan asked the YCP leaders why they give promises that cannot be implemented. He denied that YCP leaders are doing politics. CM Jagan criticized that there is no situation to come out today. If he really knew the conditions outside, why would the roads in the state be like this, he asked. Pawan accused the government of bringing caste disputes in Konaseema district to cover up MLC Anantha Babu's affair. If the government really respected Ambedkar then why Konaseema district was not named after that? Pawan called for change in the state to start from Godavari districts. Will YCP win again? Pawan said that the Godavari districts have the power to decide whether they want a new government.

Telugu Version

ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కాపాడే శక్తి జనసేన పార్టీకి ఉందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. బలమైన ప్రతిపక్షం, బలమైన వ్యక్తుల సమూహాం ప్రజాస్వామ్యానికి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆ బలాన్ని భరోసాగా ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా మండపేట రైతు భరోసా సభలో కోరారు. ఇవ్వడమే తనకు తెలుసని, అడగడం తనకు జీవితంలో ఇంత వరకు తెలియదని అన్నారు. ఓట్లు అడగటం కూడా తనకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూడాలని ప్రజలను ఈ సందర్భంగా కోరారు. తనకు ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీని నడిపిస్తానని పవన్‌ మరోసారి స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తన పార్టీని విలీనం చేయడం జరగదన్నారు. తననేమి గుడ్డిగా నమ్మొద్దని కోరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

అమలు చేయలేని హామీలెందుకు?

కాగా ఈ సందర్భంగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు కురిపించారు జనసేనాని. అమలు చేయలేని హామీలు ఎందుకు ఇస్తారని వైసీపీ నాయకులను పవన్ ప్రశ్నించారు. రాజకీయం చేయమని చెప్పే YCP నాయకులు చేస్తున్నదేంటని నిలదీశారు. సీఎం జగన్‌ నేడు బయటకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. నిజంగా ఆయనకు బయటకి పరిస్థితులు తెలిసి ఉంటే రాష్ట్రంలో రోడ్లు ఇలా ఎందుకు ఉంటాయని అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారాన్ని మభ్యపెట్టేందుకు ప్రభుత్వం కోనసీమ జిల్లాలో కుల వివాదాలు తీసుకువచ్చిందని పవన్‌ ఆరోపించారు. అంబేడ్కర్‌ అంటే ప్రభుత్వానికి నిజంగా గౌరవం ఉంటే ముందే కోనసీమ జిల్లాకు ఆ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మార్పు అన్నది గోదావరి జిల్లాల నుంచి ప్రారంభం కావాలని పవన్‌ పిలుపునిచ్చారు. మరోసారి వైసీపీని గెలిపిస్తారా? కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటారా అన్నది నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు ఉందని పవన్‌ తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens