Andhra Pradesh politics is heating up day by day. The ruling party YSRCP, opposition parties TDP, Jana Sena and BJP are moving forward with counter strategies. At this moment, along with politics.. personal criticism.. it went to movies without stopping there.
Personal life.. Political life are two different things.. but.. AP politics revolves around personal matters.. In this order a new turn has taken place in AP politics. Janasena leader Pawan Kalyan's ex-wife Renu Desai released a video and made sensational comments.
He appealed not to drag himself and his children into politics. She pointed out that her ex-husband wants to make movies and OTT series with topics related to her.. that is not correct. Criticism is natural in politics, but don't drag children and women. He suggested that it is not good to drag the children of any politician, not just his children. Our children are still small children..
Pawan Kalyan is not a man of money.. He advised me not to bring out my personal life. Not stopping at that, Renu Desai also made many important comments on Pawan Kalyan. Renudesai suggested that what her ex-husband (Pawan) did in her case was completely wrong.. but not to bring it into politics.
To this end, Renu Desai released the video on the stage of Insta. Pawan Kalyan's ambitions are great.. Pawan is not a money man.. Give Pawan one chance.. Pawan's desire to work for people is great.. said Renu Desai.
Telugu version
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ తరుణంలో రాజకీయాలతో పాటు.. వ్యక్తిగత విమర్శలు.. అక్కడితో ఆగకుండా సినిమాల్లోకి వెళ్లింది.
వ్యక్తిగత జీవితం.. రాజకీయ జీవితం రెండూ వేరు.. కానీ.. ఏపీ రాజకీయాలు వ్యక్తిగత విషయాల చుట్టూనే తిరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ వీడియో విడుదల చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను, తన పిల్లలను రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. తన మాజీ భర్త తనకు సంబంధించిన అంశాలతో సినిమాలు, ఓటీటీ సిరీస్‌లు తీయాలనుకుంటున్నాడని.. అది సరికాదని సూచించింది. రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ.. పిల్లలను, మహిళలను లాగొద్దు. ఏ రాజకీయ నాయకుడి పిల్లలనే కాదు ఆయన పిల్లలను లాగడం మంచిది కాదని సూచించారు. మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలే..
పవన్ కళ్యాణ్ డబ్బుకు బానిస కాదని.. నా వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీసుకురావద్దని సూచించారు. అంతటితో ఆగకుండా రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ పై పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తన విషయంలో మాజీ భర్త (పవన్) చేసింది పూర్తిగా తప్పేనని.. అయితే రాజకీయాల్లోకి తీసుకురావద్దని రేణుదేశాయ్ సూచించారు.
ఈ మేరకు రేణు దేశాయ్ ఇన్‌స్టా వేదికపై వీడియోను విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ ఆశయాలు గొప్పవి.. పవన్ డబ్బు మనిషి కాదు.. పవన్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ప్రజల కోసం పని చేయాలనే పవన్ కోరిక చాలా గొప్పది.. అని రేణు దేశాయ్ అన్నారు.