సవిత: డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త – ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ప్రారంభం

బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డీఎస్సీ అభ్యర్థుల కోసం ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమం సచివాలయంలో ఆమె చేతుల మీదుగా ప్రారంభమైంది. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో, శామ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన 'ఆచార్య' యాప్ ద్వారా ఈ శిక్షణ అందించబడనుంది.

ఈ ఆన్‌లైన్‌ కోచింగ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. గృహిణులు, సుదూర ప్రాంతాల్లో నివసించే వారు, చిన్న ఉద్యోగాలు చేసే వారు ఆఫ్‌లైన్‌ కోచింగ్‌కు హాజరుకాలేక ఇబ్బంది పడుతున్నారని ఆమె చెప్పారు. ఈ సౌకర్యాన్ని అందించడానికి వారి విజ్ఞప్తి మేరకే ఆన్‌లైన్‌ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

శిక్షణా సమయంలో అర్హులైన అభ్యర్థులకు నెలకు రూ. 1500 చొప్పున ఉపకార వేతనం మరియు పుస్తకాలు కొనుగోలు చేయడానికి ₹1000 అదనంగా ఆర్థిక సహాయం అందజేయబడనుంది. ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధనలు, అన్ని సబ్జెక్టుల పై స్టడీ మెటీరియల్స్, గత డీఎస్సీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. శామ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఈ రంగంలో విస్తృత అనుభవం ఉన్నందున, ఈ బాధ్యత వారికి అప్పగించినట్లు మంత్రి పేర్కొన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens