మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి దుర్మరణం పాలయ్యారు. పారిపోతున్న ఆయనను ఉగ్రవాదులు వెంటాడి కాల్చిచంపినట్లు సమాచారం. "చంపొద్దు" అని ప్రార్థించినా, ఉగ్రదళాలు ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని తెలుస్తోంది. అనంతరం చంద్రమౌళి మృతదేహాన్ని ఆయనతో వచ్చిన ఇతర పర్యాటకులు గుర్తించారు.
ఈ విషాదవార్త తెలుసుకున్న వెంటనే విశాఖ నుంచి ఆయన కుటుంబ సభ్యులు పహల్గాం వైపు బయలుదేరి వెళ్లారు. ఈ దాడిలో మొత్తం 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్లు, మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది.