Oh God The crops that need to be harvested are rainsoaked Your eyes will not stop crying when you see the pleadings of the farmers

Paddy crops have been damaged in Telangana due to untimely rains and hailstorms. In many IKP centers, grain is wet. The dry grain in the eyes was wet and kissed. The rain was stifling with thunder and lightning. Hail rains accompanied by gusty winds destroyed the paddy crop. Farmers are expressing their grief that all the hard work they put in to protect their crops has been destroyed due to wind and hail.

Untimely rains fell twice in a week and caused huge losses to the farmers. The grain and corn that had been harvested were waterlogged. The grain in the market yards of Vanaparthi, Nagar Kurnool and Narayanapet towns was wet and rotten. At present the weather is cloudy. The farmer is getting scared as there is a possibility of rain again. Farmers say that they have lost due to the delay in the purchase of grain. More information will be provided by our representative Sami.

The mangoes in the plantations of the mango farmers were severely damaged due to the fall of the mangoes. Farmers are crying looking at their grain. Unharvested paddy fields in some villages were completely washed away by rockfall. Due to this, the farmers are in a situation where they are not able to get even a kilo of the crop that they got. The government is requested to provide financial assistance to the farmers who have suffered losses due to untimely rains and hailstorms.

Telugu version

తెలంగాణలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి పంటలకు నష్టం వాటిల్లింది. పలు ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసిపోయింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈదురు గాలుల‌తో కూడిన వడగండ్ల వాన కురిసి చేతికంది వచ్చిన వరిపంట నేలపాలైంది. ఎంతో శ్రమించి పంట రక్షణ కోసం పడ్డ కష్టమంతా గాలివాన, వడగండ్ల మూలంగా నేలపాలైందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అకాల వర్షాలు వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పడి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి.చేతికొచ్చిన ధాన్యం, మొక్కజొన్న నీటి పాలైంది. వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట పట్టణాల్లోని మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. ప్రస్తుతం వాతావరణం మబ్బులు పట్టి ఉంది. మళ్లీ వర్షం పడే అవకాశం ఉండడంతో రైతన్న భయపడిపోతున్నాడు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్లనే తాము నష్టపోయామంటున్నారు రైతులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సమి అందిస్తారు.

మామిడి రైతుల తోటల్లోని మామిడి కాయలు నేల‌రాలడంతో తీవ్రంగా నష్ట పోయారు. రైతులు తమ ధాన్యాన్ని చూస్తూ రోదిస్తున్నారు. కొన్ని గ్రామాలలోని వ‌రికోయ‌కుండానే పంటచేలోని వరిధాన్యం రాళ్లవానకు పూర్తిగా నేల‌మ‌ట్టమ‌య్యింది. దీంతో చేతికి వచ్చిన పంట కిలో కూడా చేతికి రాని పరిస్థితికి ఉంద‌ని రైతులు కంటత‌డి పెడుతున్నారు. అకాల వర్షాలతో పాటు, వడగండ్లకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens