LPG Gas Cylinder Price has been cut down by 36 RS from August 1st

Oil companies had good news for commercial gas consumers on Monday (August 1). 19 kg commercial gas cylinder prices have come down slightly. The oil companies have announced that they will be reducing the prices by Rs.36 and will implement these prices from Monday morning. As a result, the price of a commercial gas cylinder in Delhi, the capital of the country, decreased by Rs.36 and reached Rs.1976.50. Earlier its price was Rs.2012.50. And in Hyderabad, the commercial cylinder has decreased by Rs.44.50. Currently, the price of a gas cylinder in the city is Rs.2197.50.

In Kolkata, the price of a cylinder which was previously Rs.2,132 has come down to Rs.2095.50. In Mumbai, the cylinder which was Rs.1972.50 has become Rs.1936.50. However, there has been no change in the prices of the 14.2 kg household cylinder. With the latest decision, restaurants, eateries, tea stalls and other business operators who use 19 kg gas cylinders will get some relief.

To check LPG cylinder price, go to the website of state-owned oil company IOC. Companies release new rates every month. (https://iocl.com/Products/IndaneGas.aspx) You can check the price of gas cylinders in your city through this link.

Telugu Version

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు సోమవారం (ఆగస్టు 1) శుభవార్త చెప్పాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కొంతమేర తగ్గించాయి. రూ.36 మేర తగ్గిస్తున్నట్లు, సోమవారం ఉదయం నుంచే ఈ ధరలను అమలు చేయనున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కాస్తా రూ.36 తగ్గి రూ.1976.50కు చేరుకుంది. గతంలో దీని ధర రూ.2012.50గా ఉండేది. ఇక హైదరాబాద్లో వాణిజ్య సిలిండర్పై రూ.44.50 మేర తగ్గింది. ప్రస్తుతం నగరంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.2197.50కు లభ్యమవుతోంది.

ఇక కోల్కతాలో గతంలో రూ.2,132గా ఉన్న సిలిండర్ ధర రూ.2095.50కు దిగొచ్చింది. ముంబైలో రూ.1972.50గా ఉన్న సిలిండర్ 1936.50 గా మారింది. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తాజా నిర్ణయంతో 19 కిలోల గ్యాస్ సిలిండర్లు ఎక్కువగా వినియోగించే రెస్టారెంట్లు, తినుబండారాలు, టీస్టాల్స్ ఇతర వ్యాపార నిర్వాహకులకు కాస్త ఉపశమనం కలగనుంది.

LPG సిలిండర్ ధరను చెక్ చేయడానికి, ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ IOC వెబ్సైట్కు వెళ్లాలి. కంపెనీలు ప్రతి నెలా కొత్త రేట్లు విడుదల చేస్తాయి. (https://iocl.com/Products/IndaneGas.aspx) ఈ లింక్ ద్వారా మీరు మీ నగరంలోని గ్యాస్ సిలిండర్ల ధరను చెక్ చేయవచ్చు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens