Domestic LPG Gas Cylinder Price Increased 06-07-2022

English Version

Bad news for the poor and middle class. Domestic oil companies have given consumers another shock. Another burden fell on the common man in the form of increase in gas cylinder price. The price of 14.2 kg cylinder used for household purposes has increased once again. Oil companies have taken a decision by increasing the price of rock by Rs.50. As a result, the price of gas has crossed 1100. This decision will further burden the common man who is already reeling from the increase in the prices of essentials and petro products. With the latest increase, the gas cylinder price in Delhi has reached Rs.1053 from the current Rs.1003. The gas price in Hyderabad has increased from Rs.1055 to Rs.1105. Normally, oil companies update their prices on the 1st of every month. On 1st of this month, the price of 19 kg commercial cylinder has been reduced by Rs.183.50. Recently, after 5 days of the month, increasing the price of domestic gas cylinder has become a topic of discussion. Meanwhile, the oil companies have announced that the increased gas cylinder price will come into effect from today (Wednesday).

Telugu Version

పేద, మధ్యతరగాతి వర్గాలకు బ్యాడ్ న్యూస్. దేశీయ చమురు సంస్థలు వినియోగదారులకు మరో షాకిచ్చాయి. సామాన్యుడిపై గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరుగుదల రూపంలో మరో భారం పడింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. బండ ధరను రూ.50 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో.. గ్యాస్‌ బండ రేటు 1100 దాటేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామన్యులపై మరింత భారం పడనుంది. తాజా పెంపుతో ఢిల్లీ(Delhi) ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1053కు చేరుకుంది. హైదరాబాద్‌(Hyderabad)లో గ్యాస్‌ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. మాములుగా అయితే ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు చేస్తాయి చమురు సంస్థలు. ఈ నెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌ ధరను రూ.183.50 మేర తగ్గించాయి. తాజాగా నెలలో 5 రోజులు గడిచిన తర్వాత డొమెస్టిక్ గ్యాస్‌ సిలిండర్ ధరను పెంచడం చర్చనీయాంశంగా మారింది. కాగా పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధర నేటి(బుధవారం) నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens