ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఆటగాడు కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్స్‌ల్లోనే 5,000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు.
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ అజేయంగా 57 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. ఈ జాబితాలో అతనికి తరువాతి స్థానాల్లో ఉన్నవారు:
డేవిడ్ వార్నర్ (135 ఇన్నింగ్స్)
విరాట్ కోహ్లీ (157)
ఏబీ డివిలియర్స్ (161)
శిఖర్ ధావన్ (168)
రాహుల్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో:
సగటు: 46.35
స్ట్రైక్‌రేట్: 135.70
సెంచరీలు: 4
హాఫ్ సెంచరీలు: 40
డక్కౌట్లు: 4
ఇక నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే, ఢిల్లీ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 17.5 ఓవర్లలోనే ఛేదించింది.