DK who made interesting comments about KL Rahul.

'This is a professional world. Sometimes we have to face painful moments. I too have experienced such a phase. It is even more painful when we realize that this could be our last innings. Same thing happened to me. At that time I went back to the dressing room and silently went to the washroom and shed tears. Such a situation is very sad," said Dinesh Karthik while referring to KL Rahul's form. DK said that although Rahul is a good player, he has lost his groove in the last few days. If he is removed for the upcoming matches, KL also knows the reasons for that. Therefore, DK suggested that Rahul should take a break for some time, recover and come back to the team.

Meanwhile, Rahul, who has been struggling with form or stagnant performance for some time now, has won the first two Test matches of the Border Gavaskar Trophy, which is currently being played against Australia. Due to this reason, there are huge demands from former players and sports fans to remove him from the team. In this order, even though Rahul was selected for the remaining two Tests in this series, the selection committee removed him from the position of vice-captain of the team. There is uncertainty whether he will be included in the final team or not. However, the third Test match between India and Aussie teams will be held from March 1 at the indoor venue.

Telugu version

‘ఇది ప్రొఫెషనల్‌ ప్రపంచం. ఇందులో కొన్ని కొన్ని సార్లు మనం బాధాకరమైన క్షణాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి దశను నేను కూడా అనుభవించాను. ఇది మన చివరి ఇన్నింగ్స్‌ కావొచ్చేమోనన్న విషయం మనకు అర్థమైతే అది ఇంకా బాధాకరం. నాకూ అలానే జరిగింది. ఆ సమయంలో నేను డ్రెస్సింగ్‌ రూంలోకి తిరిగొచ్చాక మౌనంగా వాష్‌రూంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నా. అలాంటి పరిస్థితి చాలా విచారకరం’ అంటూ కేఎల్ రాహుల్‌ ఫామ్‌ గురించి ప్రస్తావిస్తూ దినేష్ కార్తీక్ మాట్లాడాడు. ఇంకా రాహుల్‌ మంచి ప్లేయరే అయినప్పటికీ గత కొన్ని రోజులుగా అతడు గాడి తప్పాడని డీకే అన్నాడు. ఒకవేళ అతడిని రానున్న మ్యాచ్‌లకు తొలగిస్తే దానికి కారణాలు కూడా కేఎల్‌కు స్పష్టంగా తెలుసన్నాడు. అందువల్ల రాహుల్‌ కొంతకాలం విరామం తీసుకోవాలని, తిరిగి పుంజుకుని జట్టులోకి తిరిగి రావాలని డీకే సూచించాడు.

కాగా, గత కొంతకాలంగా ఫామ్ లేక అటకెక్కిన ఆటతీరుతో ఇబ్బంది పడుతున్న రాహుల్.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలోని తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ చేతులేత్తేశాడు. ఈ కారణంగానే అతడిని జట్టు నుంచి తొలగించాలని అటు మాజీల నుంచి, క్రీడాభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో మిగతా రెండు టెస్టులకు రాహుల్‌ను ఎంపిక చేసినప్పటికీ.. అతడిని జట్టు వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించింది సెలెక్షన్ కమిటీ. ఇక తుది జట్టులో అతడిని తీసుకుంటారా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే భారత్, ఆసీస్ జట్ల మధ్య మార్చి 1 నుంచి ఇండోర్‌ వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌ జరుగుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens