It's raining now and it's raining for the next five days

Rain in the morning followed by rain at night is the same situation in both the states. Untimely rains destroyed the crops and created havoc. But the weather department says that these rains will not stop now. There are chances of rains especially in Andhra Pradesh for another five days. Droni extending from Vidarbha through North Tamil Nadu to South Karnataka, surface circulation continues over the surrounding areas of South Chhattisgarh. He said that due to the surface trough which is covered at a height of 1.5 km, there is a possibility of moderate rains in the coast and Rayalaseema in the next 24 hours.

There is a possibility of heavy rains accompanied by thunder and lightning at many places. Gusty winds with a speed of 40 to 45 km per hour are likely to blow along the south coast. Also fishermen are advised not to go hunting and farmers are advised to take precautions. Meanwhile, in the last 24 hours, 9 cm of rain was recorded in Sullurpet, 8 cm in Terlam and 7 cm in Gudur.

Light to moderate rains or thundershowers are likely at many places in North Coast Andhra Pradesh and Yanam on Wednesday and Thursday. There are chances of heavy rain at one or two places. Thunderstorms are likely to occur at one or two places. Gusty winds (with a speed of 40-50 kph) are likely to blow at one or two places. He said that moderate rains or thundershowers are likely to occur from light on Thursday. Officials say that heavy rains are likely at one or two places. There is a possibility of thundershower at one or two places. Also, gusty winds (30-50 mph) are likely to blow at one or two places.

Telugu version

ఉదయం ఎండ రాత్రి కాగానే వర్షం ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అకాల వర్షం చేతికొచ్చిన పంటలను నాశనం చేస్తూ బీభత్సం సృష్టించింది. అయితే ఈ వానలు ఇప్పట్లో ఆగవని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి, దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

పలు చోట్ల ఉరుములు మెరుపలు ఈదురు గాలులు కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే గడచిన 24 గంటల్లో సూళ్లూరుపేటలో 9 సెంటీమీటర్లు, తెర్లాంలో 8 సెంటీమీటర్లు, గూడూరులో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గురవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఈదురు గాలులు (గంటకు 30-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens