Is there any real matter in CM Jagan Delhi tour Are the whispers in the political circle true

CM Jagan is once again ready for Delhi tour with a tag line to discuss the problems of the state. Although it is said that it is to discuss the problems of the state, it is strongly heard that the discussions that take place inside are different. Is there a political agenda behind the meeting with central leaders? Will you discuss the relationship between the two parties? What is the secret behind CM Jagan's visit to Delhi?

In fact, even though there is still a year left for the elections in AP, the election mood is now visible. Politics is heating up with every strategy. Chandrababu and Pawan Kalyan sharpened their political strategies. The opposition leaders, who have already announced that their goal is to remove YSRCP from power, said that they will do whatever they have to do for that.

 At a time like this, CM Jagan's visit to Delhi is attracting more interest. Usually, CM Jagan goes to Delhi to discuss issues related to the state and funding issues with central leaders. In the past, Jagan went to Delhi several times and gave a petition to the Prime Minister regarding the funds due to the state as well as key projects. But this time there is a lot of interest in the tour. There is a strong discussion that there are political reasons in this trip besides funds.

The Center has already agreed to release 12 thousand 911.15 crores for the Polavaram project. Funds will be released through cabinet approval. Then the center released the funds under the revenue deficit. It is said that Jagan, who is going to fight in Delhi today, will discuss the promises of partition with the Prime Minister. But it is very clear that the internal discussions are different.

 It seems that political issues will mainly be discussed in the meeting with the Prime Minister. Especially in AP, the alliance of TDP, Janasena and BJP is being discussed vigorously. It seems that Jagan will discuss with the Prime Minister what is the attitude of the BJP leaders in this matter. The main leaders of YSP say that there is a possibility of taking the harsh criticism of Janasena, which is an ally of BJP, to the Prime Minister's attention.

Telugu version

రాష్ట్ర సమస్యలపై చర్చించాలనే ట్యాగ్‌లైన్‌తో సీఎం జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకే అని చెబుతున్నా.. లోపల జరిగే చర్చలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని బలంగా వినిపిస్తోంది. కేంద్ర నేతలతో భేటీ వెనుక రాజకీయ ఎజెండా ఉందా? రెండు పార్టీల మధ్య సంబంధాలపై చర్చిస్తారా? సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యం ఏంటి?

నిజానికి ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పుడు ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఒక్కో వ్యూహంతో రాజకీయం వేడెక్కుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. వైఎస్సార్‌సీపీని అధికారం నుంచి దించడమే తమ లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన విపక్ష నేతలు.. అందుకు ఏం చేయాలో అది చేస్తామన్నారు.

  ఇలాంటి తరుణంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణంగా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, నిధుల సమస్యలపై కేంద్ర నేతలతో చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తుంటారు. గతంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు కీలక ప్రాజెక్టులపై జగన్ పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. అయితే ఈసారి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ యాత్రలో నిధులతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని జోరుగా చర్చ సాగుతోంది.

పోలవరం ప్రాజెక్టుకు 12 వేల 911.15 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం ఇప్పటికే అంగీకరించింది. కేబినెట్ ఆమోదం ద్వారా నిధులు విడుదలవుతాయి. ఆ తర్వాత రెవెన్యూ లోటు కింద కేంద్రం నిధులు విడుదల చేసింది. ఇవాళ ఢిల్లీలో పోరాటానికి దిగనున్న జగన్.. విభజన హామీలపై ప్రధానితో చర్చిస్తారని చెబుతున్నారు. కానీ అంతర్గత చర్చలు భిన్నంగా ఉన్నాయని చాలా స్పష్టంగా ఉంది.

  ప్రధానితో జరిగే భేటీలో రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో బీజేపీ నేతల వైఖరి ఏమిటో ప్రధానితో జగన్ చర్చిస్తారని తెలుస్తోంది. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనపై ఘాటు విమర్శలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని వైసిపి ముఖ్య నేతలు చెబుతున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens