Visakhapatnam steel plant.. now apart from Telugu states.. is causing a stir in national politics as well. The politics that started with the issue of privatization has reached to the bids. Politics has become more heated with incidents like the Centre's not backing down in the matter of privatisation, and the Telangana government also showing interest in making a bid. In this order, unexpected developments are taking place in the matter of steel plant privatization. Attempts by new forces to participate in the bid have become interesting.
Former CBI JD Lakshminarayana will participate in steel plant EOI. It was decided to participate in the bid on behalf of the people. Lakshminarayana will participate in the EOI at 3 pm this afternoon. Lakshminarayana, who announced that the details are in suspense at the moment, announced that he is participating in the bid on behalf of the people. Former CBI JD Lakshminarayana has revealed that he is participating in Visakha steel plant bidding. He said that he is preparing with all the related documents and is going to participate in the EOI this afternoon. Lakshminarayana said that if their proposal is rejected, they will go to court. They declared that their aim is to have the steel plant in the public sector.
Telugu Version
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ రాజకీయాల్లో సైతం కలకలం రేపుతోంది. ప్రైవేటీకరణ అంశంతో మొదలైన రాజకీయాలు.. బిడ్ల వరకు చేరుకుంది. కేంద్రం ప్రైవేటికరణ విషయంలో వెనక్కి తగ్గకపోవడం.. తెలంగాణ ప్రభుత్వం సైతం బిడ్ వేసేందుకు ఆసక్తి చూపడం.. లాంటి ఘటనలతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బిడ్‌లో పాల్గొనేందుకు కొత్త శక్తులు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. స్టీల్ ప్లాంట్ EOIలో CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు. జనం తరపున బిడ్‌లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మధ్యాహ్నం 3 గంటలకు EOIలో లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు. ప్రస్తుతానికి వివరాలు సస్పెన్స్ అని ప్రకటించిన లక్ష్మీనారాయణ.. ప్రజల తరపున బిడ్‌లో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తాను పాల్గొంటున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. దానికి సంబంధించిన పత్రాలన్నింటితో సిద్ధమవుతున్నానని, ఈ మధ్యాహ్నం EOIలో పాల్గొనబోతున్నానని తెలిపారు. తమ ప్రతిపాదను రిజెక్ట్ చేస్తే కోర్టుకు వెళ్తామని లక్ష్మీనారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్‌లో ఉండాలదన్నది తమ లక్ష్యమని ప్రకటించారు.