Jagan's government has given good news to those working in village and ward secretariats. The Andhra Pradesh state government issued orders on Monday (April 17) finalizing probation for those who got jobs in village and ward secretariats through the second batch of notification. All those who got jobs through the notification issued in 2020 are currently receiving a salary of Rs.15 thousand per month.
Grade 5 Panchayat Secretaries and Ward Administrative Secretaries who have completed probation are currently receiving a salary of Rs. 23,120. After including DA and HRA, their salary is Rs. 29,598 will increase. While the employees of the remaining 17 departments are currently receiving Rs.22,460.. Including DA and HRA, Rs. 28,753 will increase the salary, officials said. In urban areas some people get slightly higher salary as per HRA slab. The increased wages will be effective from May 1. This means that on June 1, the employees will get an increased salary.
Telugu version
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండో విడత నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి కూడా ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (ఏప్రిల్ 17) ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరంతా ప్రస్తుతం నెలకు రూ.15 వేల వేతనం అందుకుంటున్నారు.
ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ప్రస్తుతం అందుకుంటున్న వేతంనం రూ.23,120 కాగా.. డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకున్న తర్వాత వారి వేతనం రూ. 29,598కు పెరగనుంది. మిగిలిన 17 విభాగాల ఉద్యోగులు ప్రస్తుతం రూ.22,460 అందుకుంటుండగా.. డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలుపుకొని రూ. 28,753లకు వేతనం పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. పట్టణ ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏ స్లాబు ప్రకారం కొంత మందికి కొంచెం ఎక్కువ వేతనం వస్తుంది. పెరిగిన వేతనాలు మే 1 నుంచి అమలులోకి రానున్నాయి. అంటే జూన్ ఒకటిన ఉద్యోగులకు పెరిగిన జీతం అందుతుంది.