The Police Recruitment Board has released the hall tickets for the SI preliminary examination to be held on 19th of this month in Andhra Pradesh .
An opportunity to download the hall tickets has been provided till 5 pm on 15th February. Shift – 1 from 10 am to 1 pm and Shift – 2 from 2.30 pm to 5.30 pm will be held on 19th. Candidates can enter registration number, date of birth and get hall tickets.
On the other hand.. Constable preliminary exam results have been released. Andhra Pradesh Police Recruitment Board has released the results.
The results are made available on the APSLPRB website. 4,59,182 candidates appeared for the constable exam across the state, out of which 95,208 candidates qualified for the physical fitness tests. The preliminary examination was conducted on 22nd of last month for the filling of 6,100 posts.
Telugu Version
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 19న జరిగే ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లను పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ఫిబ్రవరి 15 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
19 వ తేదీన ఉదయం పది గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు షిఫ్ట్ – 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు షిఫ్ట్ – 2 పరీక్షలు జరగుతాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు.
మరోవైపు.. కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలు విడుదల చేసింది.
ఫలితాలను ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కానిస్టేబుల్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. మొత్తం 6,100 పోస్టుల భర్తీ కోసం గతనెల 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.