ED raids in Raipur during plenary.. Houses of Congress leaders searched in coal mining scam.

In next four days i.e. between February 24-26, Congress party plenary meeting will be held in Raipur. The Congress alleged that the BJP ED was conducting searches as part of a conspiracy to block the plenary sessions. The Congress strongly warned that 2024 is not far away and the officials who are carrying out these attacks will be punished. CM Bhupesh Baghel questioned why ED is not raiding the house of former CM and BJP leader Raman Singh, who runs many shell companies. He alleged that the ED raids were being conducted under the direction of Raman Singh.

In the form of coal levy scam in Chhattisgarh, there have been suspicions of a huge extortion conspiracy to the tune of Rs.450 crores in the last two years. ED has registered a money laundering case on the complaint of the Income Tax Department and is investigating the matter. The ED has already arrested nine people, including CM Deputy Secretary Soumya Chaurasia, IAS officer Sameer Vaishnoi, Suryakant Tiwari and coal businessman Sunil Agarwal, who are accused as benami in this scam. Their properties were also attached.

Telugu version

మరో నాలుగు రోజుల్లో అంటే ఫిబ్రవరి 24- 26 మధ్య కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు రాయ్‌పూర్‌లో జరుగుతాయి. ప్లీనరీ సమావేశాలను అడ్డుకునే కుట్రలో భాగంగా బీజేపీ ఈడీ సోదాలు చేయిస్తోందని కాంగ్రెస్‌ మండిపడింది. 2024 ఎంతో దూరంలో లేదని , ఈ దాడులు చేస్తున్న అధికారులు తగిన శిక్ష అనుభవిస్తారని కాంగ్రెస్‌ ఘాటుగా హెచ్చరించింది. ఎన్నో షెల్‌ కంపెనీలు నడుపుతున్న మాజీ సీఎం , బీజేపీ నేత రమణ్‌సింగ్‌ ఇంటిపై ఎందుకు ఈడీ దాడులు చేయడం లేదని ప్రశ్నించారు సీఎం భూపేష్‌ బఘేల్‌. రమణ్‌సింగ్‌ డైరెక్షన్‌ లోనే ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు లెవీ కుంభకోణం రూపంలో గడిచిన రెండేళ్లలో రూ.450 కోట్ల మేరకు భారీ దోపిడీ కుట్ర జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదు మేరకు మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ.. ఈ మేరకు దర్యాప్తు చేపడుతోంది. ఈ కుంభకోణంలో బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం ‌ డిప్యూటీ సెక్రెటరీ సౌమ్య చౌరాసియా, ఐఏఎస్‌ అధికారి సమీర్‌ వైష్ణోయ్‌, సూర్యకాంత్‌ తివారీ, బొగ్గు వ్యాపారవేత్త సునీల్‌ అగర్వాల్‌సహా తొమ్మిది మందిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. వారి ఆస్తులనూ అటాచ్‌ చేసింది


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens