Cancer spreading like water under the carpet.

Cancer is one of the health problems that plague the world humanity. Cancer is a disease that starts in an organ or tissue of the body. Cancer is the second leading cause of death worldwide .

 This disease that started in a single cell increases and increases the physical, mental and financial problems. Scientists have identified more than a hundred types of cancer worldwide. Many types of cancer have been identified such as breast, lungs, skin, throat, uterus, ovary, stomach, intestines, mouth cancer.

 Many studies say that the number of people affected by these diseases is more than 13 lakhs every year. At some stages, cancer is attacking humanity by claiming lives.

In this background, with the intention of researching cancer, preventive measures, and providing better treatment to the patients. There are many causes of cancer. The most important reason for this is the lifestyle of a person while the food or eating habits followed is another reason. Apart from these many other reasons are becoming factors of cancer disease. The earlier the cancer is detected, the more chances there are to cure it. The later the diagnosis, the more critical the treatment. 

Telugu Version

ప్రపంచ మానవాళిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్ అనేది శరీరంలోని ఓ అవయవానికి, కణజాలంలో మొదలయ్యే వ్యాధి.

 ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌నాల‌ను బ‌లితీసుకుంటున్న వ్యాధుల్లో క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారిది రెండో స్థానం. ఒక్క క‌ణ‌జాలంలో మొదలైన ఈ వ్యాధి అంతకంతకూ పెరుగుతూ శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకు పైగా క్యాన్సర్‌ వ్యాధి రకాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. బ్రెస్ట్, లంగ్స్, స్కిన్, త్రోట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ ఇలా పలు రకాల క్యాన్సర్లు గుర్తించబడ్డాయి. ఏటా వీటి బారిన పడుతున్న వారి సంఖ్య దాదాపు 13 లక్షలకు పైనే అని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. కొన్ని దశల్లో క్యాన్సర్ ప్రాణాలను సైతం బలి తీసుకుంటూ మానవాళిపై దాడి చేస్తోంది.

ఈ నేపథ్యంలో క్యాన్సర్‌ వ్యాధిపై పరిశోధన, నిరోధక చర్యలు, వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో..ప్రతి ఏటా ఫిబ్రవరి 4న జరుపుకునే వరల్డ్ క్యాన్సర్ డే గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం. క్యాన్సర్ వ్యాధి సోకడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైన కారణం మనిషి లైఫ్ స్టైల్ కాగా తీసుకునే ఆహారం లేదా పాటించే ఆహారపు అలవాట్లు మరో కారణం. ఇవే కాకుండా ఇంకెన్నో కారణాలు క్యాన్సర్ వ్యాధికి కారకాలుగా మారుతున్నాయి. క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే.. అది నయం అవడానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎంత ఆలస్యంగా గుర్తిస్తే.. చికిత్స అంత క్రిటికల్ అవుతుంది.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens