We all know that banana plays a prominent role in maintaining human health. But not only with the fruit, but also with the banana flower, you can get amazing benefits. The reason for that is the rich nutritional value and medicinal properties of banana flower. If we talk about the minerals in the banana flower, it contains calcium, potassium, copper, magnesium and iron. That is why these flowers are taken in salads and soups. Now let's know the health benefits of banana flower.
Health benefits of banana flower
Diabetes: Several studies have indicated that the medicinal properties of banana are useful in controlling diabetes. It controls the blood sugar level along with increasing the glucose in the body.
Prevents cancer and heart diseases: Banana flower is useful in preventing cancer and heart diseases. Phenolic acids, tannins, flavonoids, and many other antioxidants present in banana flowers fight free radicals. It also prevents oxidative damage and reduces the risk of heart disease and cancer.
Telugu version
మానవ ఆరోగ్యాన్ని కాపాడడంలో అరటి పండు ప్రముఖ పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే పండుతోనే కాదు.. అరటి పువ్వుతో కూడా అద్భుత ప్రయోజాలను పొందవచ్చు. అరటి పువ్వులో పుష్కలంగా ఉన్న పోషక విలువలు, ఔషధ గుణాలే అందుకు కారణం. ఇక అరటి పువ్వులో ఉండే మినరల్స్ గురించి చెప్పుకోవాలంటే దీని నుంచి కాల్షియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఐరన్ వంటివి ఉంటాయి. అందుకే ఈ పువ్వులను సలాడ్లు, సూప్‌గా తీసుకుంటుంటారు. ఈ క్రమంలో అరటి పువ్వుతో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు
డయాబెటీస్: అరటిపువ్వులోని ఔషధ లక్షణాలు మధుమేహాన్ని నియంత్రిండంలో ఉపయోగకరంగా ఉంటాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. శరీరంలోని గ్లూకోజ్‌ను పెంచడంతో పాటు ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.
క్యాన్సర్, గుండె జబ్బుల నివారిణి: అరటి పువ్వు క్యాన్సర్, గుండె జబ్బుల నివారణలో ఉపయోగపడుతుంది. అరటి పువ్వులలో ఉండే ఫినోలిక్ ఆమ్లాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇంకా ఆక్సీకరణ నష్టాన్ని నివారించి.. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.