International

2026 ఆస్కార్ అవార్డులకు కొత్త నిబంధనలు ప్రకటించాయి

98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న

అమెరికాలోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 98వ ఆస్కార్ అవార్డుల వివరాలను ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల వేడుక 2026 మార్చి 15న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ లో జరగనుంది. ఈసారి ఆస్కార్ అవార్డుల కోసం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టినట్లు తెలిపింది.

2026 జనవరి 22న ఆస్కార్ నామినేషన్ల జాబితాను ప్రకటించనున్నట్లు అకాడమీ తెలిపింది. కొన్ని కేటగిరీల్లో ఓటింగ్ విధానంలో మార్పులు చేశామని వెల్లడించింది. నామినేట్ చేసిన ప్రతి సినిమాను అకాడమీ సభ్యులు తప్పక చూడాల్సిందేనని స్పష్టం చేసింది.

ఈసారి "అచీవ్‌మెంట్ ఇన్ కాస్టింగ్" అనే కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఈ విభాగానికి రెండు దశల్లో ఓటింగ్ ఉంటుంది. తుది ఓటింగ్‌కు ముందు కాస్టింగ్ డైరెక్టర్లు కొన్ని టెస్ట్ రౌండ్లు ఎదుర్కొంటారని వివరించారు.

ఇక కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా నిర్మించిన సినిమాలను కూడా ఈసారి పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే ఇవి ఇతర సినిమాలపై ప్రభావం చూపవని, సాధారణ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అకాడమీ స్పష్టం చేసింది.

2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య విడుదలైన సినిమాలు ఆస్కార్‌కు అర్హత కలిగి ఉంటాయి. కానీ మ్యూజిక్ విభాగానికి చివరి గడువు 2025 అక్టోబర్ 15 అని పేర్కొంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens