జీ5లో ఉగాది పండుగ సంబరాలు: మార్చి 28న రాబోతోన్న 'మజాకా'

సందీప్ కిషన్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. హాస్య ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పై ఈ చిత్రం రాజేష్ దండ నిర్మించారు. ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నవ్వుల బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం సిద్ధంగా ఉంది.

సందీప్ కిషన్ రీసెంట్ హిట్ ‘మజాకా’ ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ కోసం రాబోతోంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రం మార్చి 28న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. జీ5 వీక్షకులు ఈ ఉగాదిని నవ్వుల బ్లాక్ బస్టర్‌తో జరుపుకోబోతున్నారు. ఇప్పటికే జీ5లో "సంక్రాంతికి వస్తున్నాం", "మ్యాక్స్", "కుడుంబస్తన్" వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్‌లుగా సూపర్ హిట్ అవుతున్నాయి.

ప్రస్తుతం జీ5లో "సంక్రాంతికి వస్తున్నాం", "మ్యాక్స్", "కుడుంబస్తన్" వంటి చిత్రాలు టాప్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఉగాది సందర్భంగా ‘మజాకా’ రాకతో వినోదం మరింత రెట్టింపు కానుంది. నవ్వుల బ్లాక్ బస్టర్‌ను చూసి ఈ ఉగాదికి అందరూ ఎంజాయ్ చేయండి.

ZEE5 గురించి:

జీ5 భారతదేశపు యంగెస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. ఇది మల్టీలింగ్వల్ స్టోరీటెల్లింగ్‌లో ప్ర‌సిద్ధి చెందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుండి ప్రారంభమైన జీ5, గ్లోబల్ కంటెంట్ ప‌వ‌ర్‌హౌస్‌గా దూసుకుపోతోంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ, 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షల+ ఆన్ డిమాండ్ కంటెంట్ ఉన్న ఈ ప్లాట్‌ఫార్మ్, 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళం, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ) అందుబాటులో ఉంది. జీ5లో బెస్ట్ ఒరిజినల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్, కిడ్ షోస్‌, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాలు ఉన్నాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens