The Union Public Service Commission (UPSC) in New Delhi has released a notification seeking applications for various civil service posts like 1105 IAS, IPS, IFS in various central services.
The Union Public Service Commission (UPSC) in New Delhi has issued a notification seeking applications for various civil service posts like 1105 IAS, IPS in various central services. These posts will be filled through Civil Services Examination (CSE) 2023. Applicants must have passed Bachelors Degree or equivalent course from any recognized University. Final year degree students are also eligible to apply. Candidates age should be between 21 to 32 years as on August 1, 2023. There is relaxation in age limit for reservation categories.
Interested candidates can apply online through February 21, 2023 by 6 PM. General candidates have to pay a registration fee of Rs.100. Fee waiver for SC/ST/PWD/Female candidates. Selection will be done on the basis of written test (preliminary, mains) and interview. The preliminary exam will be held on May 28. For other details you can check the official notification.
Selection process..
First stage.. There are two papers in the preliminary written exam. Each paper will have objective questions for 200 marks in 2 hours. The examination will be conducted in two sessions, morning and afternoon. But the second paper General Studies is a qualifying paper. 33 percent marks in this is enough. Both these papers will have negative marking. Candidates who qualify in prelims will be allowed to write mains. Mains exams will be conducted for 8 papers for a total of 1750 marks. There are 2 qualifying papers in these. The marks obtained in the remaining 5 papers will be counted as final. Interview will be for 275 marks. UPSC Civil Services Exams will have a total of 2,025 marks.
Teiugu version
న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర సర్వీసుల్లో.. 1105 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి పలు సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర సర్వీసుల్లో.. 1105 ఐఏఎస్, ఐపీఎస్ వంటి పలు సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) 2023 ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2023 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 21, 2023వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 28న నిర్వహిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
ఎంపిక విధానం..
తొలి దశ.. ప్రిలిమినరీ రాత పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఐతే రెండో పేపర్ జనరల్ స్టడీస్ మాత్రం క్వాలిఫైయింగ్ పేపర్. దీనిలో 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ రెండు పేపర్లకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్షలు 8 పేపర్లకు మొత్తం 1750 మార్కులకు నిర్వహిస్తారు. వీటిల్లో క్వాలిఫైయింగ్ పేపర్లు 2 ఉంటాయి. మిగిలిన 5 పేపర్లలో పొందిన మార్కులను ఫైనల్‌గా కౌంట్ చేస్తారు. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. మొత్తం 2,025 మార్కులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఉంటాయి.