Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy has taken a key decision regarding the tourism sector. He said that tourist police stations are being established in 20 tourist areas of the state. It has been revealed that these are being made available with the aim of providing security and information to the tourists.
Police stations were started virtually from Tadepalli camp office. Chief Minister Jagan said that more than 20 lakh women have downloaded the Disha app across the state. If a complaint is made on the Disha app, they give a reply within 5 seconds and they go to the scene of the incident within 5-10 minutes.
CM Jagan said that necessary equipment is being made available during emergency. It has been clarified that the tourist police stations will work to ensure security in tourist and holy places. He hoped that the staff at the tourist police stations would work with dedication and service.
Telugu version
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యాటక రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులకు భద్రత కల్పించడం, సమాచారం అందించడమే లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పోలీస్స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. దిశ యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా కోటి 20 లక్షలకు పైన మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారన్న ముఖ్యమంత్రి జగన్.. దిశ యాప్లో ఫిర్యాదు చేస్తే 5 సెకన్ల లోపు రిప్లై ఇస్తున్నామని, 5-10 నిమిషాల సమయంలోనే ఘటనా స్థలానికి వెళ్తున్నామని వెల్లడించారు.
ఎమర్జెన్సీ సమయంలో అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచుతున్నామని సీఎం జగన్ తెలిపారు. పర్యాటక, పుణ్య క్షేత్రాల్లో భద్రతకు భరోసా ఇస్తూ టూరిస్టు పోలీసు స్టేషన్లు పనిచేస్తాయని స్పష్టం చేశారు. టూరిస్టు పోలీసు స్టేషన్లలో సిబ్బంది అంకిత భావం, సేవాభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.