One of the leading OTTs, G5 offers unlimited, fresh and diverse content for its audience in Telugu, Tamil, Kannada, Malayalam, Hindi, Marathi, Gujarati, Bengali and other languages. 'Puli Meka' is all set to join this OTT library on February 24 as another best original. G5 has joined hands with Kona Film Corporation for this original. Lavanya Tripathi, Adi Sai Kumar and Siri Hanmanth are playing the lead roles. Director Bobby and hero Sidhu Jonnalagadda released this original trailer on Monday. Watching the trailer…
The trailer of Pulimeka starts saying, "Don't say death, it's impossible to escape when it comes. The way the dialogue was said and the scenes seen in the background seemed to be the best take off. Bhagavad Gita comes to mind after hearing the dialogue. Anil's murder took place in SR Nagar near Shamirpet Lake one month back. Adi will be introduced in the character of Prabhakar Sharma saying that he did that murder and this murder was done by only one sir. Suman appears as a police official. Based on his words, it is understood that a psycho has targeted the police department.
Telugu version
ప్రాముఖ ఓటీటీల్లో ఒకటైన జీ 5 తమ ఆడియెన్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో అపరిమితమైన, కొత్తదైన, వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్రరీలో ఫిబ్రవరి 24న మరో బెస్ట్ ఒరిజినల్‌గా జాయిన్ కావటానికి సిద్ధమవుతుంది ‘పులి మేక’. ఈ ఒరిజినల్ కోసం జీ 5 కోన ఫిల్మ్ కార్పొరేషన్‌తో జాయిన్ అయ్యింది. లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సోమవారం ఈ ఒరిజినల్ ట్రైలర్‌ను డైరెక్టర్ బాబీ, హీరో సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే…
‘‘చావు చెప్పిరాదు, వచ్చినప్పుడు తప్పించుకోవడం సాధ్యం కాదు అంటూ మొదలవుతుంది పులిమేక ట్రైలర్. ఆ డైలాగును చెప్పిన తీరు, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే దృశ్యాలు బెస్ట్ టేకాఫ్‌గా అనిపించాయి. డైలాగ్ వినగానే భగవద్గీత గుర్తుకొస్తుంది. ఒన్‌మంత్ బ్యాక్ షామిర్‌పేట్ లేక్ దగ్గర ఎస్ ఆర్ నగర్ ఎస్ ఐ అనిల్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసింది, ఈ మర్డర్ చేసింది ఒక్కరే సార్ అని చెబుతూ ప్రభాకర్ శర్మ కేరక్టర్‌లో పరిచయమవుతారు ఆది. పోలీస్ అఫిషియల్‌గా కనిపిస్తారు సుమన్. ఆయన మాటలను బట్టి ఒక సైకో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని టార్గెట్ చేశాడని అర్థమవుతుంది.