Molugu Venkat Reddy (38) lives with his mother, wife Kalyani and two daughters at Pochammagudi in Kushaiguda. His wife and in-laws do not like his mother being with Venkat Reddy, a private employee.
Because of this, they kept pestering us to put another camphor. As a result of this, animosity arose between the couple and the wife took Aligi's children and went to Warangal two months ago.
In this order, on July 2, Nana brought her parents to Kalyani's husband's house and created a ruckus. She insisted to send her aunt out of the house immediately. Moreover, the whole property was forced to be written in the name of the children. Kalyani did not listen no matter how much she said that the honor would be lost.
They taunted that you would die for drama. Venkat Reddy, deeply offended by this, committed suicide by drinking insecticide on the same day. His mother noticed him and immediately rushed him to the hospital where he died on Wednesday. Kushaiguda SI Shakeshafi said that after receiving information about the incident, the police registered a case and shifted the body for postmortem.
Telugu version
కుషాయిగూడలోని పోచమ్మగుడిలో మొలుగు వెంకట్‌రెడ్డి(38) తన తల్లి, భార్య కళ్యాణి, ఇద్దరు కూతుళ్లతో నివసిస్తున్నాడు. ప్రైవేట్ ఉద్యోగి వెంకట్ రెడ్డితో తల్లి ఉండడం భార్యకు, అత్తమామలకు ఇష్టం లేదు.
దీంతో మరో కర్పూరం పెట్టమని మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు. దీంతో దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్య అలిగి పిల్లలను తీసుకుని రెండు నెలల క్రితం వరంగల్ వెళ్లింది.
ఈ క్రమంలో జూలై 2న కళ్యాణి భర్త ఇంటికి తల్లిదండ్రులను తీసుకొచ్చి నానా హంగామా సృష్టించింది. తక్షణమే అత్తను ఇంటి నుంచి పంపించాలని పట్టుబట్టింది. అంతేకాదు ఆస్తి మొత్తం పిల్లల పేరు మీద రాయాలని ఒత్తిడి తెచ్చారు. పరువు పోతుందని ఎంత చెప్పినా కల్యాణి వినలేదు.
మీరు డ్రామా కోసం చనిపోతారని దుయ్యబట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకట్ రెడ్డి అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు కుషాయిగూడ ఎస్‌ఐ షాకేషాఫీ తెలిపారు.