తెలంగాణ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం ఈఏపీసెట్ నోటిఫికేషన్ నేడు విడుదల!
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ ఈ రోజు (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, వచ్చే వారం నుండి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జేఈఈ మెయిన్ పరీక్షల తర్వాత ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష తేదీలు:
- అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు: ఏప్రిల్ 29, 30, 2025
- ఇంజినీరింగ్ పరీక్షలు: మే 2, 3, 4, 5, 2025
ఈ ఏడాది ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలు జేఎన్టీయూకే అప్పగించబడ్డాయి. జేఎన్టీయూ ప్రొఫెసర్ డీన్ కుమార్‌ను ఈఏపీసెట్ 2025 పరీక్ష కన్వీనర్‌గా నియమించారు. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఈ ఏడాది తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్, విజయవాడ జిల్లాలలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి.