శుక్రవారం జరిగిన మ్యాచ్లో కోల్ కతా నైట్రైడర్స్ రస్సెల్ షో జరిగింది . 31 బాల్స్ కి 70 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు . ఇది ఇలా ఉండగా బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా తన బాల్ తో మ్యాజిక్ చేసాడు . 4 ఓవర్స్ కి 23 పరుగులు ఇచ్చి 4 వికెట్స్ తీసాడు . ఇంకా పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఈ విధంగా ఉంది . ఐపీఎల్ 2022 పాయింట్స్ టేబుల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదటి స్థానానికి వెళ్ళింది. పంజాబ్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గ కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిచింది . ఈ గెలుపుతో 4 పాయింట్స్ తో టాప్లో నిలిచింది. 4 పాయింట్లతో కోల్ కతా మొదటి స్థానంలో ఉండగా రాజస్థాన్ రాయల్స్ రెండవ స్థానంలో 2 పాయింట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ మూడో స్థానంలో 2 పాయింట్స్ , నాలుగోవ స్థానంలో గుజరాత్ టైటాన్స్ 2 పాయింట్స్ తో టాప్ నాలుగు స్థానాల్లో నిలిచాయి. మే 22 వరకు టాటా ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు జరుగుతాయి. అప్పటి వరకు టాప్ నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్‌కి వెళ్లే అవకాశం ఉంటుంది.