Indian Railways: Railway Department is updating. It is advancing by introducing new technology from time to time. The company, which is already providing better facilities through the IRCTC app, is trying to bring more reforms in the online ticket booking process.
IRCTC, which has already launched a chatbot named 'Ask Disha' (Digital Interaction to Seek Help Anytime) to resolve customer queries, is now working hard to connect this chatbot with state-of-the-art Artificial Intelligence (AI). Through this, the passenger is given the facility to book the ticket easily by giving a command orally. This is called voice centric e-ticketing.
Telugu version
Indian Railways: రైల్వే శాఖ అప్‌డేట్ అవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తోంది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా మెరుగైన సౌకర్యాలను అందిస్తున్న సంస్థ.. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే వినియోగదారుల సందేహాల నివృత్తి కోసం ‘ఆస్క్ డిశా’(డిజిటల్ ఇంటరాక్షన్ టు సీక్ హెల్ప్ ఏనీటైం) పేరుతో చాట్ బాట్‌ను ఆవిష్కరించిన ఐఆర్‌సీటీసీ.. ఇప్పుడు ఈ చాట్ బాట్ అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను అనుసంధానించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. దీని ద్వారా ప్రయాణికుడు నోటితో కమాండ్ ఇవ్వడం ద్వారా ఈజీగా టికెట్ బుక్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనిని వాయిస్ సెంట్రిక్ ఈ-టెకెటింగ్ అని అంటారు.