English Version
Now the number of people watching movies and web series has increased. During the lockdown, many people stayed at home and got used to movie content. As all the movie content of the country and abroad are available in OTTs, they watched it immensely. As a result, the content of movie watchers in the theaters has decreased a lot. And OTTs are also trying to impress the viewers by bringing different original web series. Meanwhile, the details of movies and web series that are available in various OTTs this week are for you.
Nani Ante Sundaraniki - July 10 - Netflix
Kamal Haasan Vikram - July 8 - Disney Hot Star
Modern Love Hyderabad - July 8 - Amazon Prime
Telugu Version
ఇప్పుడు మూవీలు, వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లు బాగా పెరిగిపోయారు. లాక్‌డౌన్ సమయంలో చాలామంది ఇళ్లలోనే ఉండిపోయి మూవీ కంటెంట్‌కు అలవాటుపడ్డారు. ఓటీటీలలో దేశ విదేశాల్లోని మూవీ కంటెంట్ అంతా అందుబాటులో ఉండటంతో.. విపరీతంగా చూశారు. దీంతో అటు థియేటర్స్ మూవీ చూసేవాళ్ల కంటెంట్ బాగా తగ్గిపోయింది. ఇక ఓటీటీలు సైతం విభిన్నమైన ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు తీసుకువస్తూ వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా ఈవారం వివిధ ఓటీటీలలో అందుబాటులోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు మీ కోసం.
నాని అంటే సుందరానికి(ante sundaraniki)- జూలై 10- నెట్ ఫ్లిక్స్
నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ హీరోహీరోయిన్లుగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ జూలై 10న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించారు.
కమల్‌హాసన్ విక్రమ్(vikram)- జూలై 8- డిస్నీ హాట్ స్టార్
దాదాపు పుష్కర కాలం తర్వత విక్రమ్ సినిమాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాడు లోకనాయకుడు కమల్‌హాసన్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఊహించని వసూళ్లను సాధించింది. ఈ మూవీలో చాలా హైలెట్స్ ఉన్నాయి. విజయ్ సేతుపతి విలన్ గా నటించగా మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్‌గా కీ రోల్ పోషించారు. ఈ సినిమా జూలై 8 నుండి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
మోడ్రన్ లవ్ హైదరాబాద్(modern love hyderabad)- జూలై 8- అమెజాన్ ప్రైమ్
మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 8 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఆరు ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు నగేష్ కుకునూర్, దేవికా బహుదానం, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించారు. ఆరు ప్రేమకథలతో అంథాలజీగా ఈ సిరీస్ తెరకెక్కింది.