Naga Chaitanya Thank You Trailer Launch Event

Naga Chaitanya is the hero of the latest movie 'Thank You'. There are huge expectations on this movie directed by Vikram Kumar. While Rashi Khanna is acting with Chai in this, Malavika Nair and Avikagore are playing pivotal roles. The first look and teaser of the film, which have already been released, have brought positive buzz to the film. The film unit is preparing to release the film on July 22, which has completed its shooting. With the release date approaching, the film's unit has stepped up its promotions. As part of this, the trailer of the latest movie has been released.

The makers have once again impressed with the trailer which revealed the line of the movie with the teaser itself. Chaitanya is impressive in his role of not compromising for what he believes in. And the dialogues in the trailer are arousing interest. Especially Chai's dialogues like, 'Love that can let you go is greater than love that hangs on you', 'If we forget where we started, the destination we have reached is not worth it'. The film seems to be an emotional love journey.

Chaitanya is seen in a completely stylish look in this movie. Dil Raju and Sirish are jointly producing the film under the banner of Sri Venkateswara Creations. It is known that Taman is providing the music. And to know what kind of wonders this movie will create at the box office, which is coming amid many expectations, we have to wait till July 22nd.

Telugu Version

నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో చైకి జోడిగా రాశీ ఖన్నా నటిస్తుండగా.. మాళవికా నాయర్‌, అవికాగోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ సినిమాకు పాజిటివ్‌ బజ్‌ను తెచ్చిపెట్టాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 22న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.

టీజర్‌తోనే సినిమా లైన్‌ ఎంటో చెప్పేసిన మేకర్స్‌ ట్రైలర్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. తాను నమ్మిన దాని కోసం కాంప్రమైజ్‌ అవ్వని పాత్రలో చైతన్య ఆకట్టుకుంటున్నాడు. ఇక ట్రైలర్‌లో వచ్చే డైలాగ్‌లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చై చెప్పే.. ‘మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే, స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ గొప్పది’, ‘మనం ఎక్కడ మొదలయ్యమో మర్చిపోతే, మనం చేరిన గమ్యానికి విలువ ఉండదు’ వంటి డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్ లవ్ జర్నీలా సినిమా ఉండేలా కనిపిస్తోంది.

చైతన్య ఈ సినిమాలో పూర్తి స్థాయిలో స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మరి ఎన్నో అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో తెలియాలంటే జూలై 22వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. 
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens