Interesting scene in Padayatra.. YS Sharmila who drank Kallu.

On the other hand, YSR TP president Sharmila's padayatra is going on from Shatapuram in Palakurti Mandal. Sharmila's padayatra will reach Palakurti Square in the afternoon via Thorrur and Lakshminarayanapuram. Sharmila criticized Revanth Reddy as the thief found in the vote note. Sharmila said that Revanth Reddy Pilaka is in the hands of KCR and not a padayatra.. Car yatra. Revanth Reddy was criticized that his own party leaders were saying that. He questioned why should votes be cast for Congress which has sold out to KCR. Criticism of each other and competition in the background of the ongoing yatra has created a lot of tension in the constituency. Alarmed by this, the police deployed heavy forces in Palakurti. Special security arrangements have been made to avoid any clashes. Moreover, special surveillance has been increased with drone cameras. 8 drone cameras,

On the other hand, it became interesting that YS Sharmila drank Kallu during the Palakurti Padayatra. Sharmila tasted Neera by her grandmothers at the request of a Kallu Geeta worker near Lakshminarayanapuram stage. Sharmila said that she was not in the habit of drinking Kallu, but she tasted a little at the request of the Geetha worker. After listening to their problems.. YSR Telangana Party promised to deal a big blow to Kallu Geetha workers as soon as it comes to power.

Telugu version

మరోవైపు పాలకుర్తి మండలం శాతపురం నుంచి వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర సాగుతోంది. తొర్రూర్, లక్ష్మినారాయణపురం మీదుగా మధ్యాహ్నం పాలకుర్తి చౌరస్తాకు చేరుకోనుంది షర్మిల పాదయాత్ర. ఓటుకు నోటులో దొరికిన దొంగ రేవంత్‌ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు షర్మిల. రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్‌ చేతిలో ఉందన్న షర్మిల రేవంత్‌ది పాదయాత్ర కాదు.. కార్‌ యాత్ర అన్నారు. ఆ విషయం సొంత పార్టీ నేతలే చెబుతున్నారని రేవంత్‌ రెడ్డిని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కి అమ్ముడుపోయిన కాంగ్రెస్‌కు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఒకరిపై ఒకరు విమర్శలు, పోటాపోటీగా కొనసాగుతున్న యాత్ర నేపథ్యంలో నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పాలకుర్తిలో భారీగా బలగాలను దించేశారు. ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెంచారు. 8 డ్రోన్ కెమెరాలు, 350 మంది పోలీసులతో బందోబస్తు మధ్య కొనసాగుతున్నాయి షర్మిల, రేవంత్‌ రెడ్డి పాదయాత్రలు.

మరోవైపు వైఎస్‌ షర్మిల పాలకుర్తి పాదయాత్రలో కల్లు తాగడం ఆసక్తికరంగా మారింది. లక్ష్మీనారాయణ పురం స్టేజి దగ్గర కల్లు గీత కార్మికుడి కోరిక మేరకు తాటికల్లు నీరా రుచి చూశారు షర్మిల. కల్లు తాగడం తనకు అలవాటు లేదని, కానీ గీత కార్మికుడు కోరిక మేరకు కొద్దిగా రుచి చూసినట్లు షర్మిల తెలిపారు. వారి సమస్యలు విన్న అనంతరం.. YSR తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens