ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో 'నిజం గెలవాలి' బస్ యాత్ర ప్రారంభమయ్యింది. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో ఆ ప్రాంతాలు మంచు మేఘాలతో అందంగా మారుతుంది. దసరా సెలవులు కావడంతో పర్యాటకుల రాక కూడా ఎక్కువగానే ఉంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. మార్కింగ్ ఏజెన్సీ పల్లె ప్రాంతాలపై దుప్పటి మాదిరిగా పరుచుకున్నాయి.
వనజంగి వ్యూ పాయింట్, లంబసింగి ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. వనజంగి వ్యూపాయింట్ నుంచి కిందకు చూసినప్పుడు ఆ ప్రాంతమంతా మేఘాల దుప్పటి పరుచుకున్నట్టు వాతావరణం కనిపిస్తోంది. వనజంగిలో 30 ప్రైవేటు కాటేజీలు ఉండగా, అన్నీ పర్యాటకలతో నిండిపోయాయి. లంబసింగిలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి విభాగానికి చెందిన 15 కాటేజీలు ఉన్నాయి. 100కు పైగా ప్రైవేటు కాటేజీలు ఉన్నాయి. ఇవన్నీ పర్యాటకులతో పూర్తిగా నిండిపోయినట్టు వాటి నిర్వాహకులు తెలిపారు.
ఏటా నవంబర్ లో కనిపిచే వాతావరణం ఈ ఏడాది ముందుగానే వచ్చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మంగళవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా తగ్గిపోయింది. వనజంగిలో రోజూ 5,000 మంది వరకు పర్యాటకులు వస్తున్నారు. రాత్రికి కాటేజీల్లో బసులు చేసి ఉదయమే సూర్యోదయం చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సముద్ర మట్టానికి వనజంగి ప్రాంతం 3,400 అడుగుల ఎత్తులో ఉంది. విశాఖపట్నం నుంచి 3 గంటలు ప్రయాణిస్తే (100 కిలోమీటర్లు) ఇక్కడకు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి పాడేరు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బొర్రా గుహల వద్ద కూడా సందడి నెలకొంది. మంగళవారం 4,000 మంది దర్శించారు.