నల్లగొండలో పుట్టి పెరిగిన శ్రీమతి గండేపల్లి సుమలతగారు నకిరేకల్ లో నివాసం ఉంటూ, MA తెలుగు చదివి,పలు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ, చిన్నతనం నుండి సంగీతం మీద మక్కువతో దేవాలయంలో భక్తి గీతాలు పాడుతూ ఉండేవారు.
అన్నమయ్య కీర్తనల మీద మక్కువతో ఆన్లైన్ లో తొలిసారిగా శ్రీ ఇనుపకుతిక సుబ్రమణ్యం గారి వద్ద సంగీతం అభ్యసించి ఇంకా సంగీతంలో మెళకువలు నేర్చుకోవాలనే అభిలాషతో ప్రస్తుతం శ్రీ గరికిపాటి వెంకట ప్రభాకర్ గారి వద్ద సంగీత విద్యను అభ్యసిస్థున్నారు.
అలా నేర్చుకుంటూ చాలా వేదికల పైన కీర్తనలు పాడుతూ ఆ విద్యని అందరికీ తెలియజేసే పద్ధతిలో మొదటగా 2016లో ఆఫ్ లైన్ లో నకిరేకల్ లో సంగీతం నేర్పిస్తూ ఉండేవారు.
రవీంద్రభారతి,త్యాగరాయ గాన సభల్లో పాటలు పాడుతూ శ్రీ S.P బాలుగారి లాంటి ఎంతో మంది ఆదరాభిమానాలు అందుకుంటూ పలువురి ఆత్మీయతను చూరగొంటు ఉండేవారు. 2020 నుండి కరోనా లాకడౌన్ కారణంగా ఆన్లైన్ లో సంగీత శిక్షణ మొదలు పెట్టి హైద్రాబాద్, కరీంనగర్, అమెరికా, కెనడా,ఝార్ఖండ్, ఇలా అన్ని దేశాల నుండి 4 సంవత్సరాల పిల్లల నుండి అన్ని వయసుల పిల్లలకు సంగీతం నేర్పిస్తూ ప్రతి నెల