యువతకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ..హైదరాబాద్ ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం 40 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చంద్రబాబునాయుడు గారు హాజరయ్యి ఈ విధంగా వేడుకలో
వ్యాఖ్యనించారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తానని న్యాయం కోసం పోరాడలంటూ ఆవిర్భావ సభలో చంద్రబాబు సూచించారు . పార్టీలో సీనియర్లను దృష్టిలో పెట్టుకొని యువతకు పార్టీలో చోటు కల్పిస్తానని తెలిపారు . ప్రజలు పడుతున్న కష్టాలన్ని గట్టు ఎక్కాలంటే తెలుగుదేశం మళ్ళీ అధికారం లోకి రావాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో మార్పు చూడాలని కోరుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు సందేశం ఇచ్చారు. అంతే కాకుండా మన రాష్టాన్ని కాపాడుకోవాలిసినా బాధ్యత మన చేతుల్లో ఉందని , రాష్ట్ర రూపురేఖలు మార్చాలని చంద్రబాబు ఆవిర్భావ సభలో పేర్కొన్నారు.