The supermoon will once again appear in the sky. Chandamama will come closest to Earth on 13th of this month i.e. Wednesday. Moon will come at a distance of 3,57,264 from Earth. It is also known as Buck Moon. This miracle will be unveiled at 12.07 AM on Wednesday. Due to the super moon, there is a possibility of having a severe impact on the seas. Astronomers believe that during this time storms will occur in the sea areas and flood the coastal areas. Let's know what the actual supermoon is, how it appears and when it occurs.
A super moon means that the moon does not have some special powers. The moon revolves around the earth. A supermoon is the closest approach to Earth during one orbit. This is called perigee. It will appear a little bigger and brighter than before.It will appear larger than the daily visible moon. Appears bright..pink in color. One of the biggest celestial wonders that will happen this year i.e. 2022 is the Supermoon.
Telugu Version
ఆకాశంలో మరోసారి సూపర్‌మూన్ కనువిందు చేయనుంది. ఈ నెల 13న అనగా బుధవారం చందమామ భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. భూమికి 3,57,264 దూరంలో చంద్రుడు రానున్నాడు. దీనిని బక్ మూన్ అని కూడా పిలుస్తారు. బుధవారం రాత్రి 12.07 గంటలకు ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూపర్ మూన్ కారణంగా సముద్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ సమయంలో సముద్ర ప్రాంతాల్లో తుఫానులు వచ్చి.. తీర ప్రాంతాలు వరదలకు దారి తీస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అసలు సూపర్‌మూన్ అంటే ఏంటి, ఎలా కన్పిస్తకుంది, ఎప్పుడు ఏర్పడుతుందనే విషయాలు తెలుసుకుందాం.
సూపర్ మూన్ అంటే చంద్రుడికి కొన్ని ప్రత్యేక శక్తులు ఉండవు. భూమి చుట్టు చంద్రుడు పరిభ్రమిస్తుంది. ఒక కక్ష్యలో తిరుగుతున్న సమయలో భూమికి దగ్గరికి రావడమే సూపర్‌మూన్. దీనిని పెరిజీ అంటారు. ఇది మునుపుటి కంటే కొంచెం పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.రోజూ కన్పించే చంద్రుడి కంటే పెద్ద పరిమాణంలో కన్పించనుంది. ప్రకాశవంతంగా..పింక్ రంగులో కన్పిస్తుంది. ఈ ఏడాది అంటే 2022లో సంభవించే అతి పెద్ద ఖగోళ అద్భుతాల్లో ఒకటి సూపర్‌మూన్.