AP Tourism Department announced special packages for Papikondalu Godavari boat tour

Andhra Pradesh Tourism Development Department (APTDC) has announced special packages for Papikonda Vihara Yatra. She plans to go out with her family during festivals and holidays. One and two day tours are prepared from Rajamahendravaram, Pochavaram and Gandi Pochamma areas. APTDC Kakinada Divisional Manager CH Srinivas disclosed the details to this extent.


Those going to Papikondalu from Rajamahendravaram, Gandi Pochamma are requested to contact Cell : 98486 29341, 98488 83091, those going to Papikondalu from Pochavaram are requested to contact Cell : 63037 69675. From Rajamahendravaram to Papikondalu one day trip starts from 7.30 am to 7.30 pm. Adults have been charged Rs 1,250 each and children Rs 1,050 each. Breakfast in the morning, vegetarian lunch in the afternoon and snacks in the evening are provided. The two-day tour departs from Rajamahendravaram to Papikonda at 7.30 am and returns the next day at 7.30 pm. The charge is Rs.3,000 for adults and Rs.2,500 for children.

There are one-day and two-day tours from Pochavaram to Papikonda from 9.30 am to 5 pm. One day tour from Gandi Pochamma departs at 9.30 am and lasts till 5 pm. The charge is Rs.1,000 for adults and Rs.800 for children. The two-day tour starts at 7.30 am and lasts until 7.30 pm the next day. The charge is Rs.2,500 for adults and Rs.2,000 for children. Those interested are requested to take advantage of this facility.

Telugu Version

పాపికొండల విహార యాత్రకు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) స్పెషల్ ప్యాకేజెస్ ను ప్రకటించింది. పండుగ సమయాలు, సెలవు రోజుల్లో కుటుంబంతో కలిసి విహరించేలా ప్లాన్ చేసింది. ఒకటి, రెండు రోజుల టూర్‌లను రాజమహేంద్రవరం, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి సిద్ధం చేసింది. ఈ మేరకు ఏపీటీడీసీ కాకినాడ డివిజనల్‌ మేనేజర్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు.


రాజమహేంద్రవరం, గండి పోచమ్మ నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్‌ : 98486 29341, 98488 83091, పోచవరం నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్‌ : 63037 69675 నంబర్ కు సంప్రదించాలని కోరారు. రాజమహేంద్రవరం నుంచి పాపికొండలు ఒక రోజు పర్యటనకు ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు యాత్ర కొనసాగుతుంది. పెద్దలు ఒక్కొక్కరికి రూ.1,250, చిన్నారులు ఒక్కొక్కరికి రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్‌ ఇస్తారు. రెండు రోజుల పర్యటనలో రాజమహేంద్రవరం నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ.

పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకరోజు, రెండు రోజుల పర్యటనలు ఉన్నాయి. గండి పోచమ్మ నుంచి ఒక రోజు పర్యటన కు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ. రెండు రోజుల పర్యటన ఉదయం 7.30 గంటలకు స్టార్ట్ అయ్యి.. మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు ఉంటుంది. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. ఆసక్తి కలిగిన వారు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens