Another Arrest in Delhi Liquor Scam.

CBI and ED increased aggression in Delhi liquor scam. As part of the investigation, CBI has arrested Chartered Accountant Auditor Gorantla Buchibabu from Hyderabad this morning. On Tuesday (February 7), Buchibabu was taken into custody in Hyderabad by the CBI officials who shifted him to Delhi at night. Recently, another person was arrested in the same case. Prominent businessman Gautam Malhotra was arrested by the Enforcement Directorate (ED) on Wednesday in connection with the Delhi Excise Policy scam. Meanwhile, Malhotra will be produced in the special CBI court this afternoon.

 Also ED will ask him for custodial remand to get more details regarding this scam. Meanwhile, a total of nine people have been arrested so far in the excise policy scam case along with Gautham. Gautham Malhotra, son of former Shiromani Akali Dal MLA Deep Malhotra.

This is the ninth arrest in the liquor scam case. So far CBI has arrested eight people and obtained details from them. Sameer Mahendru, Vijay Nair, Sarath Chandra Reddy, Abhishek Boinapalli, Dinesh Arora, Binoy Babu, Amit Arora, Gorantla Buchibabu... are among those arrested earlier..

Telugu version


ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. విచారణలో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్‌కు చెందిన ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. మంగళవారం (ఫిబ్రవరి 7) హైదరాబాద్‌లో బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు రాత్రే అతనిని ఢిల్లీ తరలించారు.

 తాజాగా ఇదే కేసులో మరొకరు అరెస్ట్‌ అయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌తో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. కాగా ఇవాళ మధ్యాహ్నం మల్హోత్రాను సీబీఐ  ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.

 అలాగే ఈ స్కామ్ కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతనిని  కస్టోడియల్ రిమాండ్ కోరనుంది ఈడీ. కాగా గౌతమ్‌తో కలిసి ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది అరెస్ట్‌ అయ్యారు. శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు గౌతమ్ మల్హోత్రా..  పలువురు మద్యం వ్యాపారులతో సన్నిహిత సంబంధాలున్నట్లు ఆరోపణులు ఎదుర్కొంటున్నారు.

కాగా లిక్కర్ స్కామ్‌ కేసులో ఇది తొమ్మిదో అరెస్ట్. ఇప్పటి వరకు సీబీఐ  ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి వివరాలు రాబట్టింది. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, దినేష్ అరోరా, బినోయ్ బాబు, అమిత్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు.. గతంలో అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు..
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens